Delhi Water crisis | నీటి సమస్యపై అతిషి అల్టిమేటం : జూన్ 21 నుంచి నిరవధిక దీక్ష
Delhi Water crisis : ఢిల్లీలో నీటి సంక్షోభంపై తాను ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశానని ఢిల్లీ మంత్రి అతిషి బుధవారం వెల్లడించారు.
Delhi Water crisis : ఢిల్లీలో నీటి సంక్షోభంపై తాను ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశానని ఢిల్లీ మంత్రి అతిషి బుధవారం వెల్లడించారు. దేశ రాజధానిలో నీటి సమస్యను పరిష్కరించని పక్షంలో ఈనెల 21 నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపడతానని ఆమె హెచ్చరించారు. నీటి సమస్యను సత్వరమే పరిష్కరించాలని ప్రధానికి రాసిన లేఖలో తాను విజ్ఞప్తి చేశానని తెలిపారు.
ఢిల్లీకి రావాల్సిన నీటి వాటాను హరియాణ సరఫరా చేయకపోవడంతో దేశ రాజధాని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. హరియాణ మంగళవారం 613ఎంజీడీ నీటిని సరఫరా చేయాల్సి ఉండగా 513ఎంజీడీ నీటిని మాత్రమే నగరానికి సరఫరా చేసిందని ఆమె వెల్లడించారు. ఒక ఎంజీడీ నీరు 28,500 మందికి సరిపోతుందని, దీంతో 28 లక్షల మంది ప్రజలకు నీటి సరఫరా నిలిచిపోయిందని చెప్పారు.
ఈ సమస్య పరిష్కారం కోరుతూ తాను హరియాణ ప్రభుత్వానికి పలుమార్లు లేఖ రాసినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నీటి చౌర్యం, బ్లాక్ మార్కెటింగ్ అంశాల నుంచి నగరవాసుల దృష్టి మరల్చేందుకు అతిషి ఇప్పుడు సరికొత్త దిగజారుడు రాజకీయానికి తెరలేపారని ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా ఆరోపించారు.
Read More :
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

