Central Budget | ఢిల్లీకి రూ. 10,000 కోట్లు కేటాయించాలి : అతిషి
Central Budget : దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల ప్రజలు చెల్లించిన పన్నుల సమాహారమే కేంద్ర బడ్జెట్ అని ఢిల్లీ మంత్రి, ఆప్ నేత అతిషి పేర్కొన్నారు. ఈ పన్నుల్లో ఢిల్లీ వాటా అత్యధికమని ఆమె తెలిపారు.
Central Budget : దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల ప్రజలు చెల్లించిన పన్నుల సమాహారమే కేంద్ర బడ్జెట్ అని ఢిల్లీ మంత్రి, ఆప్ నేత అతిషి పేర్కొన్నారు. ఈ పన్నుల్లో ఢిల్లీ వాటా అత్యధికమని ఆమె తెలిపారు. ఢిల్లీ వాసులు ఆదాయ పన్ను కింద రూ. రెండు లక్షల కోట్లు పైగా చెల్లిస్తారని, రూ. 25,000కుపైగా సెంట్రల్ జీఎస్టీ కింద ఢిల్లీ నుంచి సమకూరుతుందని మంత్రి వివరించారు.
ఢిల్లీ ప్రజలు రెండున్నర లక్షల కోట్లకుపైగా పన్నులు చెల్లిస్తున్నారని, ఇందులో కొంతభాగం తిరిగి దేశ రాజధాని నగరానికి దక్కడం తమ హక్కని ఆమె పేర్కొన్నారు. ఈ రెండున్నర లక్షల కోట్లలో ఐదు శాతం ఢిల్లీకి కేటాయించాలని అతిషి డిమాండ్ చేశారు. ఢిల్లీలో మౌలిక వసతులు, విద్యుత్, రోడ్డు రవాణా వంటి మౌలిక రంగ ప్రాజెక్టులకు కేంద్ర బడ్జెట్ నుంచి రూ. 10,000 కోట్లు కేటాయించాలని ఆమె కోరారు.
మరోవైపు హరియాణ అసెంబ్లీ ఎన్నికల్లో 90 అసెంబ్లీ స్ధానాల్లో పోటీ చేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సిద్ధమవుతోందని ఆప్ హరియాణ చీఫ్ సుశీల్ గుప్తా వెల్లడించారు. పోలింగ్ బూత్ స్ధాయిలో పార్టీని పటిష్టం చేసేందుకు కసరత్తు సాగుతున్నదని చెప్పారు. హరియాణ ప్రజలు అరవింద్ కేజ్రీవాల్ను కోరుకుంటున్నారని అన్నారు. ఢిల్లీ, పంజాబ్ తరహాలో హరియాణకు 24 గంటల విద్యుత్, నీటి సరఫరాను ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.
Read More :
Shashi Tharoor: బీసీసీఐ సెలెక్టర్ల తీరును తప్పుపట్టిన ఎంపీ శశిథరూర్
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Atishi
- central budget
- Delh
- tax
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

