చరిత్రలో ఈరోజు: అణుపరీక్షతో గర్వించేలా చేసిన గొప్ప ప్రధాని ఈయన..
Today History: అణుపరీక్షతో భారతదేశాన్ని ప్రపంచం మొత్తం గర్వించేలా చేసిన మహా మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి జయంతి నేడు. రాజకీయవేత్తనే కాకుండా...

Today History: అణుపరీక్షతో భారతదేశాన్ని ప్రపంచం మొత్తం గర్వించేలా చేసిన మహా మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి జయంతి నేడు. రాజకీయవేత్తనే కాకుండా కవి, పాత్రికేయుడు కూడా వాజపేయి, 1924 డిసెంబర్ నెలలో సరిగ్గా ఇదే రోజున జన్మించారు. ముద్దుగా అటల్జీ అని పిలుచుకునే ఈయన రెండు సార్లు ప్రధానమంత్రిగా ఉన్నారు.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో కృష్ణాదేవి, కృష్ణ బిహారీ వాజపేయి దంపతులకు క్రిస్ట్మస్ రోజు జన్మించారు. తండ్రి వారి సొంతూరులో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. తండ్రి దగ్గర ఎల్ఎల్బీ చదివాడు. జర్నలిజంతో కెరీర్ ప్రారంభించాడు. పద్యాలు రాయడం కూడా ఆయనకు చాలా ఇష్టం. చదువుకునే రోజుల్లో ఆర్ఎస్ఎస్లో చేరిన అటల్.. అక్కడి నుంచి రాజకీయాల వైపు మళ్లారు. అటల్జీ అద్భుతమైన వక్తగా పేరుగడించారు. సాధారణ ప్రజలే కాకుండా ప్రత్యర్థి పార్టీల వారు కూడా ఆయన ప్రసంగాలను వినడానికి శ్రద్ధ చూపేవారు. అటల్జీ తొలిసారి పోటీ చేసిన ఎన్నికల్లో ఓడిపోయి.. రెండోసారి మూడు చోట్ల పోటీ చేసి ఒకదానిలో విజయం సాధించారు. 80వ దశకంలో బీజేపీకి ఇద్దరు ఎంపీలే ఉండగా.. వారిలో ఒకరు వాజపేయి. 1996లో తొలిసారి ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించారు. అయితే, మెజారిటీ లేకపోవడంతో 13 రోజుల్లోనే ఆయన ప్రభుత్వం పడిపోయింది. ఆ తర్వాత 1998 లో 13 నెలల పాటు ప్రధానిగా కొనసాగారు. అనంతరం 1999 లో అనేక పార్టీల మద్దతుతో ఏర్పాటైన ఎన్డీయే ప్రభుత్వాన్ని విజయవంతంగా ఐదేండ్ల పాటు నడిపించారు.
అటల్జీ రెండోసారి ప్రధానమంత్రి అయ్యాక అణుపరీక్ష నిర్వహించి భారతదేశ ఖ్యాతిని ప్రపంచదేశాల్లో నిలిపారు. అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సీఐఏకు కూడా అణు పరీక్ష విషయం తెలియదంటే ఎంత గోప్యంగా పరీక్ష జరిపారో అర్థమవుతుంది. తొలి పరీక్ష జరిపిన రెండు రోజుల తర్వాత మరోసారి అణు పరీక్షను విజయవంతంగా నిర్వహించి ప్రపంచంలోని అణ్వాయుధ దేశాల జాబితాలో భారత్‌ను చేర్చేలా చేశారు. 1977లో అటల్జీ విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో హిందీలో ప్రసంగించి చరిత్ర సృష్టించారు. అలా యూఎన్ వేదికపై హిందీలో ప్రసంగించిన మొదటి వ్యక్తిగా వాజపేయి నిలిచారు. 1992లో పద్మవిభూషణ్, 2015లో భారతరత్న అవార్డులు లభించాయి. తన 93 ఏండ్ల వయసులో 2018 ఆగస్టు 16న అటల్జీ తుదిశ్వాస విడిచారు.
మరికొన్ని ముఖ్య సంఘటనలు..
2012: దక్షిణ కజకిస్తాన్‌లోని షిమ్కెంట్లో కుప్పకూలిన ఏఎన్-72 విమానం, 27 మంది మరనం
1994: మాజీ రాష్ట్రపతి జ్ఞానీ జైల్ సింగ్ మరణం
1991: సోవియట్ యూనియన్ అధ్యక్ష పదవికి మిఖాయిల్ ఎస్. గోర్బచెవ్ రాజీనామా
1977: హాలీవుడ్ ప్రసిద్ధ హాస్యనటుడు చార్లీ చాప్లిన్ మరణం
1876: పాకిస్థాన్ వ్యవస్థాపకుడు ముహమ్మద్ అలీ జిన్నా జననం
1861: స్వాతంత్ర్య సమరయోధుడు, విద్యావేత్త, భారతరత్న మదన్ మోహన్ మాలవ్య జననం
ఇవి కూడా చదవండి..
కనురెప్పల అందానికి వంటింటి చిట్కాలు.. అవి ఏంటో తెలుసా..?
చేపలను తరచూ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలివే..!
మన శరీరానికి ఎంత సీ విటమిన్ అవసరం? నిపుణులేమంటున్నారు..
జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే 7 చిట్కాలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dancing | ఉత్సవాల సమయంలో గంటల తరబడి నృత్యం చేయొద్దు.. ఎందుకో చెబుతున్న నిపుణులు..
Nara Lokesh | ‘జై బాలయ్య’ అంటూ నారా లోకేష్ సందడి.. జగపతిబాబు షోలో బాలయ్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు!
Anupama Parameswaran | అనుపమ పరమేశ్వరన్ సొంతింటి పేరు ఏంటో తెలుసా..తన జీవితాన్ని మార్చిన సినిమా పేరే పెట్టుకుంది!
Love Makthal’ | ‘లవ్ మక్తల్’ బోర్డును శుభ్రం చేసిన బీఆర్ఎస్ నాయకులు
Bhargav Desh Pande | రేవంత్ రెడ్డి చుట్టున్న నలుగురు తప్ప ఎవరూ బాగుపడలేదు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

