Ghulam Nabi Azad | ఆర్టికల్ 370ను కేంద్రం మాత్రమే పునరుద్ధరించగలదు.. రాష్ట్రం కాదు: గులాం నబీ ఆజాద్
Ghulam Nabi Azad | జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే రద్దైన ఆర్టికల్ 370ను కేంద్ర ప్రభుత్వం మాత్రమే పునరుద్ధరించగలదని డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ) చైర్మన్ గులాం నబీ ఆజాద్ తెలిపారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ), కాంగ్రెస్‌పై ఆయన మండిపడ్డారు.
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే రద్దైన ఆర్టికల్ 370ను కేంద్ర ప్రభుత్వం మాత్రమే పునరుద్ధరించగలదని డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ) చైర్మన్ గులాం నబీ ఆజాద్ (Ghulam Nabi Azad) తెలిపారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ), కాంగ్రెస్‌పై ఆయన మండిపడ్డారు. కతువా జిల్లాలోని బని అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహించారు.
జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా, ఆర్టికల్ 370ను పునరుద్ధరించాలని ఎన్సీ, కాంగ్రెస్ చేస్తున్న డిమాండ్లపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆజాద్ స్పందించారు. ‘ఆర్టికల్ 370, రాష్ట్ర హోదాపై నేషనల్ కాన్ఫరెన్స్ లేదా పీడీపీ పార్లమెంటులో మాట్లాడలేదు. వాటి గురించి నేను మాట్లాడా. రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని ప్రధాని, కేంద్ర హోం మంత్రి చెప్పారు. ఆర్టికల్ 370ను భారత ప్రభుత్వం మాత్రమే పునరుద్ధరించగలదు. ఏ రాష్ట్రమూ కాదు’ అని అన్నారు.
కాగా, పదేళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుతున్నందున ప్రజల్లో విపరీతమైన ఉత్సాహం కనిపిస్తున్నదని గులాం నబీ ఆజాద్ తెలిపారు. జమ్ముకశ్మీర్ అభివృద్ధి, పురోగతి కోసం ఓటు వేయాలని ప్రజలను కోరారు. తప్పుడు వాగ్దానాలు, నినాదాలతో దోపిడీకి గురికావద్దని సూచించారు. ‘బని ప్రజలు డీపీఏపీకి ఓటు వేయడం ద్వారా సుసంపన్నమైన, సమగ్ర భవిష్యత్తుకు మార్గం సుగమం చేస్తారని మేం నమ్ముతున్నాం. మేమంతా కలిసి జమ్ముకశ్మీర్‌ను పునర్నిర్మిస్తాం’ అని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

