జమ్ము: వైట్ నైట్ క్రాప్స్‌కు చెందిన సైనికుడు ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో వీర మరణం పొందాడని సైన్యాధికారులు గురువారం వెల్లడించారు. ఉధంపూర్ జిల్లా డుడు-బసంత్‌ఘర్ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారన్న సమాచారంలో తాము సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించామని నైట్ క్రాప్స్ ఎక్స్‌లో తెలిపింది.
‘ప్రారంభ ఘర్షణలో మా ధైర్యవంతుడైన సైనికుడు ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. దవాఖానలో ఉత్తమ వైద్యం అందించినా అతడు చనిపోయాడు. ప్రత్యేక దళం 6 పారాకు చెందిన హవల్దార్ జంటు అలీ షేక్‌గా అతడిని గుర్తించాం’ అని భారత సైన్యం పేర్కొంది. ఉగ్రవాదుల వేట కొనసాగుతున్నదని తెలిపింది.