Republic Day Parade | ఇండియన్ ఆర్మీలో చారిత్రాత్మక ఘట్టం.. రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొనబోతున్న ఆర్మీ దంపతులు
Republic Day Parade | ఇండియన్ ఆర్మీలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. భార్యాభర్తలైన ఇద్దరు ఆర్మీ ఆఫీసర్లు గణతంత్ర దినోత్సవ వేడుకల పరేడ్‌లో పాల్గొననున్నారు. కర్తవ్య పథ్ వద్ద నిర్వహించే పరేడ్‌లో వేర్వేరు కాంటిజెంట్స్‌లో వీరు పరేడ్ చేయనున్నారు. ఇలా భార్యాభర్తలిద్దరూ రిపబ్లిక్ డే వేడుకల పరేడ్‌లో పాల్గొనడం ఇండియన్ ఆర్మీలో ఇదే తొలిసారి.
Republic Day Parade | న్యూఢిల్లీ : ఇండియన్ ఆర్మీలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. భార్యాభర్తలైన ఇద్దరు ఆర్మీ ఆఫీసర్లు గణతంత్ర దినోత్సవ వేడుకల పరేడ్‌లో పాల్గొననున్నారు. కర్తవ్య పథ్ వద్ద నిర్వహించే పరేడ్‌లో వేర్వేరు కాంటిజెంట్స్‌లో వీరు పరేడ్‌కు నాయకత్వం వహించనున్నారు. ఇలా భార్యాభర్తలిద్దరూ రిపబ్లిక్ డే వేడుకల పరేడ్‌లో పాల్గొనడం ఇండియన్ ఆర్మీలో ఇదే తొలిసారి.
మేజర్ జెర్రీ బ్లెయిజ్.. మద్రాస్ రెజిమెంట్‌లో మిలటరీ పోలీసుగా విధులు నిర్వర్తిస్తున్నారు. కెప్టెన్ సుప్రీత సీటీ ఆర్మీ ఎయిర్ డిఫెన్స్‌లో పని చేస్తున్నారు. అయితే వీరిద్దరూ 2023, జూన్‌లో వివాహం చేసుకున్నారు. ఇద్దరూ వేర్వేరు ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ, రిపబ్లిక్ డే పరేడ్‌లో ఇద్దరూ కలిసి పాల్గొనబోతున్నారు.
ఈ సందర్భంగా కెప్టెన్ సుప్రీత మాట్లాడుతూ.. ఎన్సీసీ డేస్ నుంచి జెర్రీ తనకు తెలుసన్నారు. తాను కూడా జెర్రీకి అప్పుడే పరిచయం అయ్యానని చెప్పారు. అయితే రిపబ్లిక్ పరేడ్‌లో పాల్గొనాలని అప్పట్లోనే కలలు కనేవాళ్లం. ఇప్పుడు ఆ కల నెరవేరబోతుందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. పరేడ్‌లో భాగంగా వేర్వేరు కాంటిజెంట్లలో తాము పాల్గొనడం గొప్ప అనుభూతిని ఇస్తుందన్నారు. రిపబ్లిక్ డే పరేడ్‌లో తామిద్దరం కలిసి పాల్గొంటామని ఊహించుకోలేదు. కానీ యాధృచ్చికంగా అవకాశం కలిసి వచ్చిందన్నారు సుప్రీత.
మేజర్ జెర్రీ బ్లెయిజ్ మాట్లాడుతూ.. తన భార్య సుప్రీత ఎన్సీసీ కాంటిజెంట్లో భాగంగా 2016లో గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొన్నదని గుర్తు చేశారు. తనకేమో 2014లో అవకాశం వచ్చిందన్నారు. ఇప్పుడేమో ఇద్దరం ఒకేసారి పరేడ్‌లో పాల్గొనబోతున్నాం. ఈ క్షణం ఎంతో సంతోషాన్నిస్తుందన్నారు. ఇక తమ రెజిమెంట్‌కు తానే నాయకత్వం వహిస్తున్నానని చెప్పారు. ఇది గొప్పగా ఉందన్నారు. మొత్తానికి తన కోరిక తీరిందన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

