Haryana | సోనిపట్‌లో ఉద్రిక్తత.. మసీదుపై దుండగుల దాడి
హర్యానాలోని (Haryana) సోనిపట్‌లో (Sonipat) తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. సోపట్లోని సందాల్ కలాన్‌లో ఉన్న ఓ మసీదుపై (Mosque) దుండగులు దాడిచేశారు. మసీదును ధ్వంసం చేయడంతోపాటు అందులో నమాజ్ (Namaaz) చేసుకుంటున్న వారిని విచక్షణారహితంగా కొట్టారు.
సోనిపట్: హర్యానాలోని (Haryana) సోనిపట్‌లో (Sonipat) తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. సోపట్లోని సందాల్ కలాన్‌లో ఉన్న ఓ మసీదుపై (Mosque) దుండగులు దాడిచేశారు. మసీదును ధ్వంసం చేయడంతోపాటు అందులో నమాజ్ (Namaaz) చేసుకుంటున్న వారిని విచక్షణారహితంగా కొట్టారు. ఆదివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత సాయుధులైన 15 నుంచి 20 మంది వ్యక్తులు (Armed men) మసీదులోకి ప్రవేశించారు. తమ చేతుల్లో ఉన్న కర్రలతో మసీదును ధ్వంసం (Vandalise) చేశారు. అక్కడ ప్రేయర్ చేస్తున్నవారిపై దాడికి పాల్పడ్డారని (Attacked) పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.
క్షతగాత్రులను సోనిపట్ దవాఖానకు తరలించారు. అయితే మసీదుపై దాడి ఎందుకు చేశారనే విషయం ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. దాడికి పాల్పడింది అదే గ్రామానికి చెందినవారుగా అనుమానిస్తున్నామన్నారు. కాగా, ఘటన తర్వాత గ్రామంలో భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా బందోబస్తు ఏర్పాటుచేశారు. దాడికి పాల్పడినవారి చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సర్య్కులేట్ అవుతున్నాయి. వారి చేతుల్లో వెదురు కర్రలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

