చీమలు సాధారణ కీటకాలు. అవి ఐక్యంగా ఉంటాయి. వాటికంటే ఎక్కువ బరువును మోస్తాయి. అవి సంఘటితంగా తమకు కావాల్సిన ఆహారాన్ని సేకరించుకుంటాయి. కాగా, కొన్ని చీమలు కలిసి బంగారు గొలుసును ఎత్తుకెళ్లాయి. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ వీడియోను చూసి నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ అధికారి (ఐఎఫ్ఎస్) సుశాంత నందా ట్విటర్లో షేర్ చేశారు. ‘చిన్న బంగారం స్మగ్లర్లు. ఐపీసీలోని ఏ సెక్షన్ కింద వీరిని బుక్ చేయొచ్చు?’ అని ఆయన క్యాప్షన్ ఇచ్చారు.
ఈ వీడియోలో కొన్ని నల్లచీమలు బంగారు గొలుసును రాయిపైనుంచి లాక్కెళ్తున్నాయి. కెమెరాలో బంధించిన ఈ అద్భుతమైన క్షణం ప్రకృతి, దాని గొప్పతనానికి స్పష్టమైన సాక్ష్యంగా నిలిచింది. ఈ వీడియో పాతదే అయినా మళ్లీ వైరల్ అవుతోందని సుశాంత నందా పేర్కొన్నారు.ఈ వీడియో ఇంటర్నెట్లో చాలా మంది దృష్టిని ఆకర్షించింది. 1,43,000 కంటే ఎక్కువ మంది వీక్షించారు. ‘వాటికి కాస్త చక్కెర ఇచ్చి ఆ గొలుసును కొట్టేయొచ్చు’ అని ఒకరు కామెంట్ చేయగా, ‘టీం స్పిరిట్ అంటే ఇది.. అందరూ కలిస్తే ఏదైనా సాధించొచ్చు’ అని మరొకరు వ్యాఖ్యానించారు.
Tiny gold smugglers 😀😀
The question is,under which section of IPC they can be booked? pic.twitter.com/IAtUYSnWpv— Susanta Nanda IFS (@susantananda3) June 28, 2022