కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత జరుగుతోంది. సౌత్ 24 పరగనాస్ జిల్లాలో .. ఎంపీ అభిషేక్ బెనర్జీ(MP Abhishek Banerjee) ఆఫీసును కూల్చివేశారు. అమతాలాలో ఆ ఆఫీసును ప్రస్తుతం అభిషేక్ వాడడం లేదు. భారీ భద్రత నడుమ యాంటీ ఎంక్రోచ్మెంట్ డ్రైవ్ కొనసాగుతోంది. తృణమూల్ కాంగ్రెస్ నేత అభిషేక్‌కు చెందిన ఆఫీసును బుల్డోజర్లతో కూల్చివేస్తున్నారు. అక్రమ రీతిలో ఆ నిర్మాణాన్ని చేపట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయిదు అంతస్తుల భవనాన్ని ఎటువంటి బిల్డింగ్ ప్లాన్ ఆమోదం లేకుండానే నిర్మించారని, బిల్డింగ్ రూల్స్ ఉల్లంఘన జరిగినట్లు అధికారులు తెలిపారు.
బుల్డోజర్లతో బిల్డింగ్‌ను కూల్చి వేశారు. బెంగాల్ పోలీసులు, సీఏపీఎఫ్ దళాలు పహారా కాశాయి. ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సిబ్బంది ఉన్నారు. ఆమ్తాలాలో పార్టీ ఆఫీసు ఉన్నది. అభిషేక్ బెనర్జీకి చెందిన డైమండ్ హార్బర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోనే ఆ బిల్డింగ్ ఉన్నది. బీజేపీ ఎమ్మెల్యే అగన్నీశ్వర్ నాస్కర్ ఆ చర్యను స్వాగతించారు. బిల్డింగ్ నియమావళిని ఉల్లంఘించినట్లు ఆరోపించారు.