షెహీన్‌భాగ్‌లో బుల్డోజర్లు.. స్థానికుల ఆందోళన
న్యూఢిల్లీ: అక్రమ నిర్మాణాల కూల్చివేతకు మళ్లీ బుల్డోజర్లు కదిలాయి. ఢిల్లీలోని షెహీన్‌భాగ్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత డ్రైవ్ చేపట్టారు. సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని షహీన్‌భాగ్‌లో ఈ డ్రైవ్ కొనసాగనున్నది. పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా షహీన్‌భాగ్‌లో కొన్నేళ్ల క్రితం నిరసన ప్రదర్శనలు జరిగిన విషయం తెలిసిందే. అయితే వాస్తవానికి ఈ ప్రాంతంలో శుక్రవారమే కూల్చివేత పనులు జరగాల్సి ఉంది. కానీ భద్రతా సిబ్బంది సంఖ్య తక్కువగా ఉన్న కారణంగా ఇవాళ మళ్లీ డ్రైవ్ చేపట్టారు. షహీన్‌భాగ్‌లోకి బుల్డోజర్లు రావడంతో.. స్థానికులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి బుల్డోజర్లను అడ్డుకున్నారు.
తుగ్లకాబాద్, సంగమ్ విహార్, న్యూ ఫ్రెండ్స్ కాలనీ, షహీన్ భాగ్ ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత జరగనున్నట్లు ఎస్డీఎంసీ చైర్మెన్ రాజ్‌పాల్ మీడియాతో తెలిపారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతకు పది రోజుల కార్యాచరణను ఎస్డీఎంసీ సిద్ధం చేసింది. రోహింగ్యాలు, బంగ్లాదేశీలు, సంఘ విద్రోహశక్తులు ఆక్రమించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని ఢిల్లీ బీజేపీ నేత ఆదేశ్ గుప్తా నగర మేయర్‌ను ఇటీవల కోరారు. ఆ తర్వాత అక్కడ బుల్డోజర్లు రంగంలోకి దిగాయి. కొన్ని రోజుల క్రితం ఢిల్లీలోని జహంగిర్‌పురిలోనూ అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

