ఆ ఇద్దరూ అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించేవారు..
Resort murder: అంకితా భండారి హత్య కేసులో అరెస్టయిన వనాంతర రిసార్టు ఓనర్ పుల్కిత్ ఆర్య, అసిస్టెంట్ మేనేజర్ అంకిత్ గుప్తా
న్యూఢిల్లీ: అంకితా భండారి హత్య కేసులో అరెస్టయిన వనాంతర రిసార్టు ఓనర్ పుల్కిత్ ఆర్య, అసిస్టెంట్ మేనేజర్ అంకిత్ గుప్తా మహిళా ఉద్యోగులపట్ల అసభ్యంగా వ్యవహరించేవారని.. ఆ రిసార్టులో పనిచేసి మానేసిన ఓ మహిళా ఉద్యోగి వెల్లడించింది. ఆ ఇద్దరూ అమ్మాయిలను అసభ్య పదజాలంతో దూషించేవారని తెలిపింది.
వనాంతర రిసార్టుకు ఎప్పుడూ వీఐపీలు వస్తుండేవారని, వారిలో కోరినవారికి పడక సుఖం అందించేందుకు బయటి నుంచి అమ్మాయిలను తీసుకొస్తుండే వారని ఆ మాజీ ఉద్యోగిని తెలియజేసింది. ఈ ఏడాది మే నెలలో ఆ రిసార్టులో ఉద్యోగంలో చేరిన నేను వారి ప్రవర్తనతో భయపడి జూలైలో మానేశానని చెప్పింది. అంకితా భండారి హత్య కేసులో పుల్కిత్ ఆర్య ప్రధాన నిందితుడు కాగా, అంకిత్ గుప్తా నిందితుడిగా ఉన్నాడు.
ఈ నెల 18న ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పౌరి జిల్లాలో వనాంతర రిసార్టులో రిసెప్షనిస్ట్‌గా పనిచేసే అంకితా భండారి హత్యకు గురైంది. రిసార్టు ఓనర్ పుల్కిత్ ఆర్య, మేనేజర్ సౌరభ్ భాస్కర్, అసిస్టెంట్ మేనేజర్ అంకిత్ గుప్తా నిందితులుగా తేలడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన నేపథ్యంలో సీనియర్ పొలిటీషియన్ అయిన పుల్కిత్ ఆర్య తండ్రి వినోద్ ఆర్యను బీజేపీ పార్టీ నుంచి తొలగించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

