Viral Video | సఫారీ కారు వెంటపడిన ఖడ్గమృగం..చివరి నిమిషంలో ఏమైందంటే..!
సఫారీ కారును ఖడ్గమృగం ఏకంగా కిలోమీటర్ పైగా వెంబడించిన వీడియో (Viral Video) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సఫారీ వాహనాన్ని ఛేజ్ చేస్తూ ఖడ్గమృగం పరుగు లంకించుకోవడంతో టూరిస్టులు వణికిపోయారు.
న్యూఢిల్లీ : జంగిల్ సఫారీల్లో ఇటీవల టూరిస్టులకు జంతువుల నుంచి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. మృగాలకు అతిదగ్గరగా టూరిస్టులు వెళుతున్న సందర్భాల్లోనూ అనుకోని ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా సఫారీ కారును ఖడ్గమృగం ఏకంగా కిలోమీటర్ పైగా వెంబడించిన వీడియో (Viral Video) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సఫారీ వాహనాన్ని ఛేజ్ చేస్తూ ఖడ్గమృగం పరుగు లంకించుకోవడంతో టూరిస్టులు వణికిపోయారు. సఫారీ కారు డ్రైవర్ చాకచక్యంతో వ్యవహరించి వాహనాన్ని వేగంగా పరుగెత్తించడంతో టూరిస్టులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ వీడియోను లేటెస్ట్ క్రగర్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయగా నెటిజన్ల నుంచి మెరుగైన స్పందన లభించింది. ఈ వీడియోలో ఖడ్గమృగం ఆగ్రహంతో సఫారీ కారును వెంబడించడం కనిపిస్తుంది. క్లిప్ చివరి వరకూ ఖడ్గమృగం కారు వెంట వేగంగా పరిగెత్తుతుంది.
కారులో కూర్చున్న అనస్తసియా చాప్మన్ అనే టూరిస్ట్ తొలుత ఈ క్లిప్‌ను షేర్ చేశారు. ఖడ్గమృగం తమ కారును వెంబడిస్తూ కిలోమీటర్ పాటు ఛేజ్ చేసింది..బురద, గుంటలతో కూడిన రోడ్డుపై కారును వేగంగా పోనిస్తూ టూరిస్టులను కాపాడేందుకు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించాడు. ఇప్పటివరకూ జంతువులతో తమకెదురైన టాప్ 5 ప్రమాదకర ఘటనల్లో ఇది ఒకటని తమ గైడ్ చెప్పారని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్ట్‌కు ఇప్పటివరకూ 3.2 లక్షల వ్యూస్ లభించాయి.
Read More :
Cyber Crime Police | సోషల్ మీడియా ట్రోలర్స్‌కు సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు
Viral Video | ఆనంద్ మహీంద్రాను ఆకట్టుకున్న వీడియో..!
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- rhino
- safari car
- Viral video
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

