శనివారం 23 జనవరి 2021
National - Dec 22, 2020 , 18:37:39

హర్యానా సీఎం ఖట్టర్‌పై రైతుల దాడి

హర్యానా సీఎం ఖట్టర్‌పై రైతుల దాడి

చండీగఢ్‌: హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌కు మంగళవారం తృటిలో ప్రమాదం తప్పింది. మూడు కేంద్ర వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఆందోళన చేస్తున్న అన్నదాతలు నల్లజెండాలు చూపి నిరసన తెలిపారు. అంబాలా నగర పాలక సంస్థ ఎన్నికల్లో ప్రచారానికి వెళుతున్న సీఎం ఖట్టర్‌ కాన్వాయ్‌లో అంబులెన్స్‌ మినహా అన్ని వాహనాలపై కర్రలతో దాడి చేశారని తెలుస్తున్నది. అయితే సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌కు ఎటువంటి ప్రమాదం జరుగలేదు. 

సీఎం ఖట్టర్‌ పర్యటన కోసం హర్యానా రాష్ట్ర అధికారులు విస్తృత ఏర్పాట్లు చేసినా.. అంబాలా వద్ద నిరసనకారులు అడ్డుకున్నారు. సీఎం కాన్వాయ్‌ను దారి మళ్లించడానికి పోలీసు అధికారులు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. ఆందోళనకారులకు నచ్చజెప్పేందుకు పోలీసు అధికారులు ప్రయత్నించినప్పుడు ఒక రైతు టర్బన్‌ గాలిలో ఎగిరింది. దీంతో ఆందోళనకారుల ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. హర్యానాలోని బీజేపీ, జన నాయక జనతా పార్టీ (జేజేపీ) నేతలకు నిరసన తెలుపాలని నిర్ణయించామని రైతులు వెల్లడించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo