న్యూయార్క్ : గ్రెటా గెర్విగ్ తెరకెక్కించిన బార్బీ మూవీ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ మూవీ అద్భుతమని ప్రేక్షకులు రివ్యూలు ఇస్తుండటంతో బార్బీకి విశేష స్పందన లభిస్తోంది. ఈ మూవీని చూసేందుకు అన్ని వయసుల వారూ థియేటర్లకు క్యూ కడుతున్నారు. బార్బీ మూవీని చూసేందుకు వృద్ధ దంపతులు తరలివచ్చిన వీడియో (Viral Post) ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
ఈ వీడియోను షకీనా అనే యూజర్ టిక్‌టాక్‌లో పోస్ట్ చేశారు. ఈ క్లిప్ ఇప్పుడు ట్విట్టర్లోనూ సందడి చేస్తోంది. ఈ వీడియోలో వృద్ధ దంపతులు ఒకరి చేతిలో ఒకరు చేయి వేసి థియేటర్ నుంచి బయటకు వస్తుండటం కనిపిస్తుంది. బార్బీతో పాటు వీరిని చూసిన తర్వాత కంటనీరు రాకుండా ఉండదని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు.
ఇక జులై 21న విడుదలైన బార్బీ గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. మార్గట్ రాబీ, ర్యాన్ గాస్లింగ్, దువ లిప, సిము లి, అరియనా గ్రీన్బ్లాట్, మైఖేల్ సెరా, ఎమ్మా మ్యాకీ నటించిన ఈ మూవీని గ్రెటా గెర్విగ్ రూపొందించగా పాజిటివ్ రివ్యూస్‌తో దూసుకుపోతోంది.
Read More :