ఇంటిని, పెంపుడు జంతువులనుజాగ్రత్తగా చూసుకునే ఏఐ రోబో!
ఇంట్లో మనం లేనప్పుడు.. ఇంటిని జాగ్రత్తగా చూసుకునేందుకు ఎవరైనా ఉంటే బాగుండునని భావించేవారికి ఎల్జీ ఎలక్ట్రానిక్స్ గుడ్‌న్యూస్ చెప్పింది.
న్యూఢిల్లీ, డిసెంబర్ 31: ఇంట్లో మనం లేనప్పుడు.. ఇంటిని జాగ్రత్తగా చూసుకునేందుకు ఎవరైనా ఉంటే బాగుండునని భావించేవారికి ఎల్జీ ఎలక్ట్రానిక్స్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇంటిని, ఇంట్లోని పెంపుడు జంతువుల సంరక్షణను చేపట్టే విధంగా ఏఐ ఆధారిత (కృత్రిమ మేధ) రోబోను ఎల్జీ తయారుచేసింది. ఏఐ రోబో ‘స్మార్ట్ హోమ్ అసిస్టెంట్’ను లాస్‌వెగాస్‌లో జరగనున్న కన్జూమర్స్ ఎలక్ట్రానిక్స్ షో-2024లో ఎల్జీ సంస్థ ఆవిష్కరించబోతున్నది. ఇది కదలిక, సంభాషణా సామర్థ్యం, అలాగే స్మార్ట్ హోమ్ మేనేజ్మెంట్ సహా అనేక రకాల ఫీచర్లను కలిగి ఉన్నదట. యజమాని ఇంట్లో లేనప్పుడు స్మార్ట్ హోమ్ అసిస్టెంట్ అనేక పనులు చేసి పెడుతుంది. ఇల్లంతా తిరుగుతూ పర్యవేక్షణ చేస్తుంది. కొత్త విషయాల్ని నేర్చుకుంటుంది. ఇతరులు చెప్పేది విని..అర్థం చేసుకుంటుంది. అంతేగాక ఇంట్లో ఉన్న పెంపుడు జంతువులను జాగ్రత్తగా చూసుకోగలదు. రోబో తరహాలోని ‘స్మార్ట్‌హోమ్ అసిస్టెంట్’కు కాళ్లు, చక్రాలు అమర్చారు. బొమ్మలు, ఇతర గుర్తులను సైతం గుర్తించి.. వాటిని అర్థం చేసుకొని ఇది పనిచేస్తుందట. ఒక్కమాటలో చెప్పాలంటే ఓ మనిషి వలె.. ఇంట్లో అన్ని పనులూ చేసి పెడుతుంది ఈ ఏఐ రోబో!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

