Amritpal Singh | ఢిల్లీలో అమృత్‌పాల్.. జాకెట్, కండ్లద్దాలతో మారు వేషంలో తిరుగుతున్న ఖలీస్తాన్ నేత ?
ఖలిస్థాన్ వేర్పాటువాద నేత, వారిస్ పంజాబ్ దే అధ్యక్షుడు అమృత్‌పాల్ సింగ్ కోసం 8వ రోజు కూడా వేట కొనసాగింది. పంజాబ్‌లో పోలీసుల కండ్లు కప్పి గత శనివారం పరారైన అమృత్‌పాల్ సింగ్ ఈ నెల 20న జాకెట్, ట్రౌజర్‌తో పాటు నల్ల కండ్లద్దాలు ధరించి అమృత్‌సర్‌లోని ఒక వీధిలో నడుస్తున్న దృశ్యం సీసీ టీవీ కెమెరాలలో రికార్డయింది.
Amritpal Singh | న్యూఢిల్లీ, మార్చి 25: ఖలిస్థాన్ వేర్పాటువాద నేత, వారిస్ పంజాబ్ దే అధ్యక్షుడు అమృత్‌పాల్ సింగ్ కోసం 8వ రోజు కూడా వేట కొనసాగింది. పంజాబ్‌లో పోలీసుల కండ్లు కప్పి గత శనివారం పరారైన అమృత్‌పాల్ సింగ్ ఈ నెల 20న జాకెట్, ట్రౌజర్‌తో పాటు నల్ల కండ్లద్దాలు ధరించి అమృత్‌సర్‌లోని ఒక వీధిలో నడుస్తున్న దృశ్యం సీసీ టీవీ కెమెరాలలో రికార్డయింది. సంప్రదాయ దుస్తులు ధరించే పాల్.. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో వేషధారణను మార్చుకున్నట్టు గుర్తించారు. హర్యానాలోని కురుక్షేత్రలో ఒక మహిళ వద్ద ఆశ్రయం పొందిన తర్వాత, అక్కడి నుంచి గొడుగులో తన ముఖం కన్పించకుండా ఒక వీధిలో వెళ్తుండటాన్ని పోలీసులు సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. అయితే ఇప్పుడు అమృత్‌పాల్ దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు.
శుక్రవారం అతడు ఢిల్లీకి బయలుదేరినట్టు గుర్తించిన పంజాబ్, ఢిల్లీ పోలీసులు శనివారం కశ్మీర్ గేట్‌లోని అంతర్రాష్ట్ర బస్ టెర్మినల్‌కు చేరుకుని అక్కడి సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. ఈ కేసుకు సంబంధించి జమ్ముకశ్మీర్ పోలీసులు శనివారం ఓ జంటను అరెస్ట్ చేశారు. అమృత్‌పాల్‌కు ముఖ్య అనుచరుడైన పాపల్‌ప్రీత్ సింగ్‌తో సంబంధాలు కలిగి ఉన్నారన్న అనుమానంతో జమ్ములోని ఆర్ఎస్పురాకు చెందిన అమ్రిక్ సింగ్, అతని భార్య పరమ్‌జిత్ కౌర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకుని వారిని పంజాబ్ పోలీసులకు అప్పగించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

