Opposition unity | రాహుల్ సమక్షంలో ఖర్గేను కలిసిన నితీశ్, తేజస్వీ.. ఎందుకంటే?
Opposition unity | ఢిల్లీ చేరుకున్న సీఎం నితీశ్ కుమార్, తన డిప్యూటీ తేజస్వీతో కలిసి మల్లికార్జున్ ఖర్గే నివాసానికి వెళ్లారు. అక్కడకు వచ్చిన రాహుల్ గాంధీ సమక్షంలో వారంతా కలిసి మాట్లాడుకున్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్షాల ఐక్యత (Opposition unity) గురించి చర్చించారు.
న్యూఢిల్లీ: బీహార్ సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ బుధవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ ముఖ్యనేత రాహుల్ గాంధీని కలిశారు. మంగళవారం ఢిల్లీ చేరుకున్న సీఎం నితీశ్ కుమార్, తన డిప్యూటీ తేజస్వీతో కలిసి మల్లికార్జున్ ఖర్గే నివాసానికి బుధవారం వెళ్లారు. అక్కడకు వచ్చిన రాహుల్ గాంధీ సమక్షంలో వారంతా కలిసి మాట్లాడుకున్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్షాల ఐక్యత (Opposition unity) గురించి చర్చించారు. అయితే ఢిల్లీలో ఉన్న సీఎం నితీశ్ కుమార్ ఇతర ప్రతిపక్ష నేతలతో కూడా సమావేశం కానున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని గద్దే దించేందుకు ప్రతిపక్షాలను ఒకతాటిపైకి తెచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు.
కాగా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా బీజేపీకి వ్యతిరేకంగా కలిసి వచ్చే ప్రతిపక్ష పార్టీల మధ్య ఐక్యతను పెంపొందించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల పలువురు నేతలతో ఆయన మాట్లాడారు. డీఎంకే చీఫ్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, శివసేనకు చెందిన మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేను సంప్రదించారు. రాబోయే రోజుల్లో ప్రతిపక్ష పార్టీలకు చెందిన అగ్ర నాయకులతో మల్లికార్జున్ ఖర్గే సమావేశం కానున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఓడించే లక్ష్యంగా వారితో చర్చలు జరుపనున్నారు.
Also Read:
Karnataka assembly elections | తొలి జాబితాతో కాషాయ పార్టీలో ప్రకంపనలు : నిరసనల వెల్లువ.. అసంతృప్తుల రాజీనామా
India Corona | వార్నింగ్ బెల్స్.. ఒక్కరోజులో 7 వేలకు పైనే కొత్త కేసులు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Civil Supplies | సివిల్ సైప్లెలో అవినీతి రాజ్యం.. మిల్లర్లతో మిలాఖత్, గన్నీ బ్యాగుల టెండర్లలో కమీషన్ల దందా!
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
Horoscope | 21-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

