Air India | ఇజ్రాయెల్‌కు విమానాలు రద్దు చేసిన ఎయిర్ ఇండియా
Air India | మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌కు విమాన సర్వీసులను ఎయిర్ ఇండియా రద్దు చేసింది. మిడిల్ ఈస్ట్‌లోని కొన్ని ప్రాంతాలలో కొనసాగుతున్న పరిస్థితుల దృష్ట్యా ఆగస్ట్ 8 వరకు టెల్ అవీవ్‌కు షెడ్యూల్డ్ విమానాల ఆపరేషన్లు నిలిపివేసినట్లు పేర్కొంది.
న్యూఢిల్లీ: మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌కు విమాన సర్వీసులను ఎయిర్ ఇండియా (Air India) రద్దు చేసింది. ఈ మేరకు శుక్రవారం ప్రకటించింది. ‘మిడిల్ ఈస్ట్‌లోని కొన్ని ప్రాంతాలలో కొనసాగుతున్న పరిస్థితుల దృష్ట్యా ఆగస్ట్ 8 వరకు టెల్ అవీవ్‌కు షెడ్యూల్డ్ విమానాల ఆపరేషన్లు నిలిపివేసాం. పరిస్థితిని మేం నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. ప్రయాణికులకు అన్ని విధాలా సహాయాన్ని అందజేస్తున్నాం. టెల్ అవీవ్‌కు వెళ్లడానికి, అక్కడి నుంచి రావడానికి టిక్కెట్లు బుకింగ్ చేసుకున్న వారికి రీషెడ్యూలింగ్, క్యాన్సిలేషన్ ఛార్జీలపై ఒకసారి మినహాయింపు లభిస్తుంది. ప్రయాణికులు, సిబ్బంది భద్రత మా మొదటి ప్రాధాన్యత’ అని పేర్కొంది.
కాగా, ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం మరింతగా తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే టెహ్రాన్‌లో హత్య తర్వాత ఇరాన్ ప్రత్యక్ష యుద్ధానికి పిలుపునిచ్చింది. అలాగే లెబనాన్‌లోని హిజ్బుల్లా కూడా ఇజ్రాయెల్‌పై దాడులు తీవ్రం చేసింది. ఈ నేపథ్యంలో మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. దీంతో పలు ఎయిర్‌లైన్స్ సంస్థలు ఇజ్రాయెల్, లెబనాన్‌కు విమానాలు రద్దు చేశాయి. ఇజ్రాయెల్, లెబనాన్, ఇరాన్ గగనతలానికి దూరంగా విమానాలను నడుపుతున్నాయి.
ANNOUNCEMENT
In view of the ongoing situation in parts of the Middle East, we have suspended scheduled operation of our flights to and from Tel Aviv with immediate effect up to and including 08 August 2024. We are continuously monitoring the situation and are extending support…
— Air India (@airindia) August 2, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- air india
- Escalating
- Flights
- Israel
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

