23 వరకు సచిన్ వాజ్ జ్యుడీషియల్ కస్టడీ

ముంబై: సస్పెండైన ముంబై పోలీస్ అధికారి సచిన్ వాజ్‌కు ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఈ నెల 23 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయనను జైలుకు తరలించారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంభానీ ఇంటి వద్ద కలకలం రేపిన పేలుడు పదార్థాలతో కూడిన వాహనం కేసు, ఆ కారుకు సంబంధించిన వ్యాపారి మన్సుఖ్ హిరేన్ హత్య కేసులపై ఎన్ఐఏ దర్యాప్తు జరుపుతున్నది. ఈ రెండు కేసుల్లో ప్రమేయం ఉన్న సచిన్ వాజ్‌ను మార్చి 13న అరెస్ట్ చేసింది. నాటి నుంచి సుమారు నెల రోజుల పాటు ఆయన కోర్టు అనుమతితో ఎన్ఐఏ కస్టడీలో ఉన్నారు.
శుక్రవారంతో తాజా కస్టడీ గడువు ముగియడంతో సచిన్ వాజ్‌ను ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చారు. మరోసారి కస్టడీ కోరని ఎన్ఐఏ, ఆయనను జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉంచాలని కోరింది. మహారాష్ట్ర ప్రభుత్వంలోని కొందరు మంత్రులు, నేతలు డబ్బులు డిమాండ్ చేసిన వైనంపై వాజ్ తమ కస్టడీలో ఉన్నప్పుడు లేఖ రాసినట్లు కోర్టుకు తెలిపింది. బుధవారం ఆయనను కోర్టులో ప్రవేశపెట్టిన సందర్భంలో ఆయన తరుఫు న్యాయవాదికి ఆ లేఖను అందజేశారని పేర్కొంది.
మరోవైపు వాజ్ ప్రాణాలకు ముప్పు ఉన్నందున భద్రత కలిగిన జైలులో ఉంచాలని ఆయన తరుఫు న్యాయవాది కోర్టును కోరారు. ఈ విన్నపాన్ని పరిగణలోకి తీసుకున్న కోర్టు సచిన్ వాజ్‌కు ఈ నెల 23 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఎన్ఐఏ దర్యాప్తు రికార్డు సమాచారం కోసం సీబీఐ దరఖాస్తు చేసిన పిటిషన్‌కు ప్రత్యేక కోర్టు అనుమతించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Haiku Movie | ‘హైకూ’ మూవీ రివ్యూ.. యూత్ ఫుల్ లవ్ ఎమోషన్స్‌తో ఆకట్టుకునే జెన్ జీ ప్రేమకథ!
వేయిస్తంభాల గుడి సుందరీకరణకు ప్రజలు సహకరించాలి : మున్సిపల్ కమిషనర్ వెంకన్న
Speaker Sets Deadline | టీవీకేలో చేరిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణకు.. గడువు విధించిన స్పీకర్
Tiger Shroff | నేరస్థులను చూస్తే నవ్వొస్తుంది.. టైగర్ ష్రాఫ్ ఘటనపై ఆర్జీవీ రియాక్షన్
Allu Arjun | అల్లు అర్జున్ ఒక్క పోస్ట్‌తో మళ్లీ మొదలైన మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్.. రజినీకాంత్‌పై ప్రశంసలే కారణమా?
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

