వారణాసి: జ్ఞానవాపి మసీదు ప్రహరికి ఉన్న హిందూ దేవతలను ప్రతిరోజు పూజించుకోవడానికి అనుమతి కోరుతూ వారణాసి కోర్టులో దాఖలైన పిటిషన్ను విచారించవచ్చని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది.
ఈ పిటిషన్ను వారణాసి కోర్టు విచారణకు స్వీకరించడాన్ని సవాల్ చేస్తూ అంజుమన్ ఇంతెజామియా కమిటీ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది.