Republic Day | ఐదు మధ్య ఆసియా దేశాలకు భారత్ ఆహ్వానం
Five Central Asian countries to be Chief Guests at India's Republic Day | వచ్చే ఏడాది జనవరిలో జరుగనున్న భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఐదు మధ్య ఆసియా దేశాలు హాజరుకానున్నాయి. కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజకిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాలను భారత్

న్యూఢిల్లీ : వచ్చే ఏడాది జనవరిలో జరుగనున్న భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఐదు మధ్య ఆసియా దేశాలు హాజరుకానున్నాయి. కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజకిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాలను భారత్ ముఖ్య అతిథులుగా ఆహ్వానించింది. 2018లో ఆసియాన్ దేశాలను ఇలాగే ఉమ్మడిగా అతిథులను ఆహ్వానించింది. అనంతరం రెండు కన్నా ఎక్కువసార్లు అతిథిగా ఆహ్వానించడం ఇదే తొలిసారి. మధ్య ఆసియా దేశాలతో భారత్‌కు సాంస్కృతిక, నాగరికత మరియు చారిత్రాత్మక బంధాలున్నాయి. దీంతో పాటు బలమైన వాణిజ్య సంబంధాలు ఉన్నాయి.
వ్యూహాత్మకంగా ఈ ఐదు దేశాలతో స్నేహం భారత్‌కు మరింత కీలకం కానున్నది. సోవియట్ యూనియన్ నుంచి విడిపోయిన ఈ ఐదు దేశాలు ఇటు చైనా, పాక్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉండడం భారత్‌కు వ్యూహాత్మకంగా కలిసి వచ్చే అంశం కాగా.. రిపబ్లిక్ వేడుకలకు ఆహ్వానించడం ద్వారా ఈ దేశాలతో సంబంధాలు మరింత బలపడే అవకాశం ఏర్పడనున్నది. మరో వైపు 2015లో ప్రధాని నరేంద్ర మోదీ అన్న మధ్య ఆసియా దేశాలను సందర్శించారు. ఇంతకు ముందు సోవియట్ యూనియన్ నుంచి విడిపోయిన అనంతరం ఏర్పాటైన ఐదు దేశాలను ఏ భారత ప్రధాని సందర్శించలేదు.
ఇదిలా ఉండగా.. ఈ నెల 18, 19న నూఢిల్లీ వేదికగా శిఖరాగ్ర సదస్సు జరుగనున్నది. ఆయా దేశాల విదేశాంగ మంత్రులు సమావేశంలో పాల్గొననున్నారు. సెంట్రల్ ఏషియా, భారత్ విదేశాంగ మంత్రుల సమావేశం జరుగడం ఇది మూడోసారి. తొలి సమావేశం ఉజ్బెకిస్తాన్‌లోని సమర్ఖండ్లో 2019, జనవరిలో జరిగింది. ఆ సదస్సులో అప్పటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పాల్గొన్నారు. గత సంవత్సరం సమావేశం వర్చువల్ విధానంలో జరిగింది. కనెక్టివిటీ, ఎనర్జీ, ఐటీ, హెల్త్‌కేర్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ మొదలైన రంగాల్లో ప్రాధాన్యతా అభివృద్ధి ప్రాజెక్టులకు భారత్ గతంలో బిలియన్ డాలర్ల రుణాన్ని ప్రకటించింది.
ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో 2014 నుంచి భారత్ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా (2015), ఫ్రెంచ్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ (2016), యూఏఈ ఎండీ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ (2017), 10 ఏషియన్ దేశాలు (2018), దక్షిణాఫ్రికా నుంచి రమాఫోసా (2019), బ్రెజిల్‌కు చెందిన జైర్ బోల్సోనారో (2020)ను ముఖ్య అతిథులుగా ఆహ్వానించింది. అయితే, గతేడాది (2021)లో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌ను ముఖ్య అతిథిగా పిలువగా.. కరోనా మహమ్మారి కారణంగా ఆయన రిపబ్లిక్ డే వేడులకు హాజరుకాలేకపోయారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

