ఉన్నావ్ హత్య కేసు నిందితుడితో ఎస్పీకి సంబంధం లేదు : అఖిలేష్ యాదవ్
యూపీలోని ఉన్నావ్‌లో దళిత మహిళ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కుమారుడు రాజోల్ సింగ్‌తో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు.
లక్నో : యూపీలోని ఉన్నావ్‌లో దళిత మహిళ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కుమారుడు రాజోల్ సింగ్‌తో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. మంత్రి నాలుగేండ్ల కిందట మరణించారని ఆయన కుమారుడితో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని అఖిలేష్ శుక్రవారం పేర్కొన్నారు. ఎస్పీ మాజీ మంత్రి కుమారుడి ఆశ్రమం వద్ద అదృశ్యమైన దళిత మహిళ మృతదేహం బయటపడిన నేపధ్యంలో అఖిలేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. దళిత మహిళ హత్య కేసుపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆయన యూపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహిళను ఊపిరిఆడకుండా చేశారని, పెనుగులాటలో ఆమె మెడ ఎముకలు విరిగాయాని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఇక దర్యాప్తులో అలసత్వం వహించిన స్ధానిక స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ)ను అధికారులు సస్పెండ్ చేశారు.
మహిళ కిడ్నాప్ కేసులో ఎస్పీ మాజీ మంత్రి దివంగత ఫతే బహుదూర్ సింగ్ కుమారుడు రాజోల్ సింగ్‌ను జనవరి 24న పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై బాధితురాలి తల్లి లక్నోలో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కాన్వాయ్ ఎదుట ఇటీవల ఆత్మహత్యా యత్నం చేయడంతో కేసులో కదలిక వచ్చింది. స్ధానిక ఎస్హెచ్ఓ అఖిలేష్ చంద్ర పాండే ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని ఆమె ఆరోపించారు. డిసెంబర్ 8న మహిళ అదృశ్యంపై ఫిర్యాదు రాగా జనవరి 10న ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఇటీవల బాధితురాలి మృతదేహం లబించిందని ఉన్నావ్ ఏఎస్పీ శశి శేఖర్ సింగ్ తెలిపారు. కేసు నమోదు చేయడంలో తీవ్ర జాప్యం జరిగిందని మహిళ కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు.
ఈ ఘటనలో ఇప్పటివరకూ ఓ నిందితుడిని అరెస్ట్ చేశామని, అతడి అనుచరుల కోసం గాలిస్తున్నామని చెప్పారు. మరోవైపు తమ కుమార్తెను రాజోల్ సింగ్ తన ఆశ్రమంలో హత్య చేసి పాతిపెట్టాడని బాధితురాలి తల్లి ఆరోపించారు. తాను ఆశ్రమానికి వెళ్లగా ఆశ్రమం అంతటినీ తనకి చూపారని, కానీ అక్కడే ఉన్న మూడంతస్తుల భవనంలోకి వెళ్లనీయలేదని చెప్పారు. స్ధానిక పోలీస్ అధికారికి తాను ఫోన్ చేయగా ఆయన ఫోన్ స్విచాఫ్ చేశాడని ఆరోపించారు. ఆరోజు ఆయన వచ్చిఉంటే తన కూతురిని సజీవంగా కాపాడుకునేవారమని అన్నారు. ఇక ఈ ఘటనను భీమ్ ఆర్మీ చీఫ్ చంద్ర శేఖర్ తీవ్రంగా ఖండించారు. నిందితులు రాజోల్ సింగ్‌తో పాటు దర్యాప్తులో అలసత్వం వహించిన పోలీసులపై కఠిన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Akhilesh Yadav
- sp
- Unnao
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

