Akhilesh Yadav | ఉత్తర ప్రదేశ్లో 19 లక్షల దొంగ ఓటర్లు.. ఎన్నికల సంఘం, సర్పై అఖిలేష్ సంచలన ఆరోపణలు
Akhilesh Yadav : ఈసీఐ చేపట్టిన సర్ ప్రక్రియ ద్వారా 19.2 లక్షల దొంగ ఓటర్లను జాబితాలో చేర్చారని అఖిలేష్ ఆరోపించారు. 2027లో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఈసీఐ, బీజేపీ కలిసి ఈ మోసానికి తెరతీశారన్నారు.
Akhilesh Yadav : కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ), బీజేపీపై సమాజ్వాదీ పార్టీ అధినేత, ఎంపీ అఖిలేష్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. ఈసీఐ చేపట్టిన సర్ ప్రక్రియ ద్వారా 19.2 లక్షల దొంగ ఓటర్లను జాబితాలో చేర్చారని అఖిలేష్ ఆరోపించారు. 2027లో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఈసీఐ, బీజేపీ కలిసి ఈ మోసానికి తెరతీశారన్నారు. ఈ మేరకు గురువారం యూపీ రాజధాని లక్నోలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈసీఐ, సర్ ప్రక్రియ, బీజేపీపై విమర్శలు చేశారు. ‘‘యూపీలో 19,20,732 దొంగ ఓట్లను సమాజ్వాదీ పార్టీ గుర్తించింది. ఇందులో ఎలక్షన్ కమిషన్ ప్రచురించని 16.18 లక్షల ఓట్లు ఉన్నాయి. మరో మూడు లక్షల అనుమానిత ఓట్లు ఉన్నాయి. ఈ జాబితా కోసం బూత్ లెవెల్ ఆఫీసర్లపై, ప్రభుత్వ అధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ ఒత్తిడి తట్టుకోలేక 29 మంది సిబ్బంది కూడా మరణించారు. యూపీలో అక్టోబర్ 2025 నుంచి ఏప్రిల్ 2026 మధ్య సర్ ప్రక్రియ జరిగింది.
అనంతరం ఓటర్ లిస్ట్ వెల్లడైంది. ఇందులో 87.56 లక్షల ఫాం 6 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో కొత్త ఓటర్లు కూడా ఉన్నారు. చివరి జాబితాలో 84.3 లక్షల కొత్త ఓటర్లు చేరారు. మొత్తం 87.56 లక్షల ఫాంలు రాగా.. వాటిలో 71.38 లక్షల దరఖాస్తుల వివరాల్ని మాత్రమే ఈసీ బహిరంగంగా ప్రచురించింది. మిగతా 16 లక్షల ఓటర్ల వివరాలు ప్రచురించలేదు’’ అని అఖిలేష్ ఆరోపించారు. జాబితాలో ప్రచురించకుండానే దాదాపు 19 లక్షల కొత్త ఓటర్లు చేరారని అఖిలేష్ విమర్శించారు.
ఎన్నికల సంఘాన్ని బీజేపీ బలహీనపరుస్తోందని ఆయన ఆరోపించారు. ఈసీఐ, బీజేపీ కలిసి ఎన్నికల్లో భారీ కుట్రకు తెరతీశాయన్నారు. బీజేపీ ఓడిపోతామనే భయం ఉన్న నియోజకవర్గాల్లోనే ఓటర్ల జాబితాలో ఇలాంటి మార్పులు ఉన్నాయని అఖిలేష్ వివరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Narendra Modi | ‘140 కోట్ల భారతీయులను గర్వపడేలా చేశారు’.. ఆసియాడ్ విజేతలకు ప్రధాని అభినందన..!
Akhilesh Yadav | ఉత్తర ప్రదేశ్లో 19 లక్షల దొంగ ఓటర్లు.. ఎన్నికల సంఘం, సర్పై అఖిలేష్ సంచలన ఆరోపణలు
KTR | రూ.3 వేల కోట్ల విదేశీ బొగ్గు స్కామ్ ఆపాలి.. సీఎం రేవంత్కు కేటీఆర్ బహిరంగ లేఖ
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
Delhi Police | రేపే సీజేపీ భారీ నిరసన.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్న ఢిల్లీ పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

