Akash Missile | ఆకాశ్ క్షిపణి పరీక్ష విజయవంతం.. సక్సెస్‌ఫుల్‌గా లక్ష్యాన్ని చేధించిన మిస్సైల్.. Video
Akash Missile | భారత్‌కు చెందిన రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) కొత్త తరం ఆకాశ్ క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఒడిశా తీరంలోని చండీపూర్‌లోగల ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ITR) ఈ పరీక్ష నిర్వహించారు. గగనతలంలో చాలా తక్కువ ఎత్తులో అత్యంత వేగంగా దూసుకెళ్లే మానవరహిత లక్ష్యంపై డీఆర్డీవో ఈ ప్రయోగాన్ని నిర్వహించింది.
Akash Missile: భారత్‌కు చెందిన రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) కొత్త తరం ఆకాశ్ క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఒడిశా తీరంలోని చండీపూర్‌లోగల ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ITR) ఈ పరీక్ష నిర్వహించారు. గగనతలంలో చాలా తక్కువ ఎత్తులో అత్యంత వేగంగా దూసుకెళ్లే మానవరహిత లక్ష్యంపై డీఆర్డీవో ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. ఆకాశ్ క్షిపణి ఆ లక్ష్యాన్ని విజయవంతంగా చేధించింది.
ఈ పరీక్ష ద్వారా డీఆర్డీవో స్వదేశీయంగా అభివృద్ధి చేసిన ఆకాశ్ క్షిపణి వ్యవస్థలోని రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్ను, లాంఛర్‌ను, మల్టీ ఫంక్షన్ రాడార్ అండ్ కమాండ్, కంట్రోల్‌ను, కమ్యూనికేషన్ వ్యవస్థ పనితీరును పరిశీలించింది. డీఆర్డీవో, భారత వైమానిక దళం (IAF), భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) కు చెందిన సీనియర్ అధికారులు ఈ క్షిపణి పరీక్షలో పాల్గొన్నారు.
ఆకాశ్ క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించిన డీఆర్డీవో, ఐఏఎఫ్‌తోపాటు క్షిపణి పరీక్షల ఇండస్ట్రీని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. తాజా పరీక్ష సక్సెస్ కావడంతో భారత రక్షణ వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Next Generation Akash missile successfully flight tested from ITR , Chandipur off the coast of Odisha today at 10:30hrs against a high speed unmanned aerial target at very low altitude. @DefenceMinIndia @SpokespersonMoD pic.twitter.com/ShRNi4dfAj
— DRDO (@DRDO_India) January 12, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

