Home
National
Air Traffic On April 30 The Number Of Domestic Air Passengers At An All Time High The Minister Said This Is A Sign Of Prosperity
Air Traffic | ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి చేరిన దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య..!
Air Traffic | దేశీయ విమాన ప్రయాణీకుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. ఏప్రిల్ 30న ఆదివారం రికార్డు స్థాయిలో 4,56,082 మంది ప్రయాణించారు. కరోనావైరస్ మహమ్మారితో దెబ్బతిన్న దేశీయ విమానరంగం మళ్లీ కోలుకుంటుందని పౌర విమానయానశాఖ మంత్రి జోతిరాధిత్య సింధియా పేర్కొన్నారు.
Air Traffic | దేశీయ విమాన ప్రయాణీకుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. ఏప్రిల్ 30న ఆదివారం రికార్డు స్థాయిలో 4,56,082 మంది ప్రయాణించారు. కరోనావైరస్ మహమ్మారితో దెబ్బతిన్న దేశీయ విమానరంగం మళ్లీ కోలుకుంటుందని పౌర విమానయానశాఖ మంత్రి జోతిరాధిత్య సింధియా పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
ఏప్రిల్ 30న భారతీయ విమాన ప్రయాణాలు కొవిడ్‌కు పూర్వం సగటును అధిగమించి గరిష్ఠ స్థాయికి చేరుకుందని తెలిపారు. మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం 4,56,082 మంది 2,978 విమానాల్లో ప్రయాణించడంతో భారతీయ విమానయాన ట్రాఫిక్ ఆల్‌టైమ్ గరిష్ఠస్థాయికి చేరుకుందని తెలిపింది. కొవిడ్‌కు ముందు దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 3,98,579గా ఉండేదని తెలిపింది. పౌర విమానయాన రంగం ప్రతిరోజూ కొత్త రికార్డులను సృష్టిస్తోందని సింధియా పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

