గాలిని శుద్ధిచేసే స్మాగ్టవర్

దేశంలోనే తొలిసారిగా ఢిల్లీలో ప్రారంభం
న్యూఢిల్లీ, ఆగస్టు 23: దేశంలోనే మొట్టమొదటి స్మాగ్ టవర్‌ను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సోమవారం ప్రారంభించారు. గాలి కాలుష్యాన్ని తగ్గించడం కోసం ఈ స్మాగ్ టవర్‌ను ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో నిర్మించారు. ఇది కలుషితమైన గాలిని పీల్చుకొని ఫిల్టర్ చేసి స్వచ్ఛమైన గాలిని బయటకు వదులుతుంది. సెకనుకు వెయ్యి క్యూబిక్ మీటర్ల గాలిని శుద్ధి చేస్తుంది. గాలి కాలుష్యాన్ని సగానికి తగ్గించడమే ఈ టవర్ నిర్మాణ ఉద్దేశం. దీనిని ప్రయోగాత్మకంగా నిర్మించారు. టవర్ పనితీరును అంచనా వేశాక భవిష్యత్తులో మరిన్ని స్మాగ్ టవర్లు నిర్మిస్తామని కేజ్రీవాల్ తెలిపారు. ఐఐటీ-బాంబే, ఐఐటీ ఢిల్లీ అందించిన సాంకేతిక సాయంతో టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్(టీపీఎల్) ఈ టవర్‌ను నిర్మించింది. స్మాగ్ టవర్ నిర్మాణానికి ఢిల్లీ మంత్రివర్గం గతేడాది అక్టోబర్‌లోనే ఆమోదం తెలిపింది. ఇదిలా ఉండగా, కేంద్రప్రభుత్వం ఆనంద్ విహార్‌లో నిర్మించిన 25 మీటర్ల మరో స్మాగ్ టవర్ ఇదే నెల 31న ప్రారంభం కానున్నట్టు తెలుస్తున్నది.
- టవర్ ఎత్తు 24.2 మీటర్లు
- వ్యయం రూ.20కోట్లు
- టవర్‌లో ఫ్యాన్లు 40
- ఫిల్టర్లు 500
- సామర్థ్యం- సెకనకు వెయ్యి క్యూబిక్ మీటర్ల గాలిని శుద్ధిచేస్తుంది
- పరిధి- టవర్ చుట్టూ 1 కిలోమీటర్ పరిధిలో గాలి శుద్ధి అవుతుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- air purifier
- Delhi
- smag tower
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

