ఏఐఈ ఉద్యోగుల సమ్మె విరమణ
ఉద్యోగులు లేవనెత్తిన అంశాలపై చర్చించడానికి ‘ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్' అంగీకరించటంతో క్యాబిన్ సిబ్బంది సమ్మెను విరమించారు. గురువారం న్యూఢిల్లీలో చీఫ్ లేబర్ కమిషనర్ (సెంట్రల్) కార్యాలయంలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఉద్యోగుల సంఘానికి (ఏఐఎక్స్ఈయూ) మధ్య ఐదు గంటలపాటు జరిగిన చర్చలు ఫలించాయి.
- తొలగించినవారిని విధుల్లోకి తీసుకుంటామని సంస్థ ప్రకటన
న్యూఢిల్లీ, మే 9: ఉద్యోగులు లేవనెత్తిన అంశాలపై చర్చించడానికి ‘ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్’ అంగీకరించటంతో క్యాబిన్ సిబ్బంది సమ్మెను విరమించారు. గురువారం న్యూఢిల్లీలో చీఫ్ లేబర్ కమిషనర్ (సెంట్రల్) కార్యాలయంలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఉద్యోగుల సంఘానికి (ఏఐఎక్స్ఈయూ) మధ్య ఐదు గంటలపాటు జరిగిన చర్చలు ఫలించాయి.
విధుల నుంచి తొలగింపునకు గురైన 25 మంది క్యాబిన్ సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకోవడానికి యాజమాన్యం అంగీకరించింది. దీంతో తాము చేపట్టిన నిరసనను క్యాబిన్ ఉద్యోగులు విరమించారు. ఉద్యోగుల సమస్యలపై మే 28న ఇరు వర్గాలు చర్చించనున్నాయి. దాదాపు 300మందికిపైగా క్యాబిన్ సిబ్బంది మూకుమ్మడి సెలవులు తీసుకోవటంతో, మంగళవారం రాత్రి నుంచి సంక్షోభం మొదలైంది. సుమారుగా 170కిపైగా విమానాలను ‘ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్’ రద్దు చేసుకోవాల్సి వచ్చింది. దీంతో వేలాది మంది విమాన ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
మరో 85 విమానాలు రద్దు
క్యాబిన్ సిబ్బంది మూకుమ్మడిగా సిక్ సెలవులు కారణంగా గురువారం మరో 85 ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు చేయాల్సి వచ్చింది. తొలగించిన ఉద్యోగుల్ని తిరిగి విధుల్లోకి చేర్చుకోకపోతే మిగతా సిబ్బంది కూడా రారని ఉద్యోగ సంఘాల ప్రతినిధి తొలుత తేల్చి చెప్పారు. ‘సిబ్బంది పట్ల యాజమాన్యం సరైన వైఖరి అనుసరించటం లేదు.
సీనియర్ స్థానాలకు జరిగిన ఇంటర్వ్యూలను కొంతమంది పూర్తిచేసినా.. వారికి ఆ ఉద్యోగాలు ఇవ్వలేదు. మెరుగైన వేతన ప్యాకేజీలు అమలు జేయటం లేదు’ అని ‘ఏఐఎక్స్ఈయూ’ ప్రతినిధులు తెలిపారు. ఉద్యోగుల ఆందోళనకు సహేతుకమైందని రీజినల్ లేబర్ కమిషనర్ అభిప్రాయపడ్డారు. కార్మిక చట్టాల ఉల్లంఘనలు సంస్థలో పెద్ద ఎత్తున ఉందన్న సంగతి మే 3న ఎయిర్ ఇండియా చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌కు రాసిన లేఖలో కమిషనర్ పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

