శుక్రవారం 03 ఏప్రిల్ 2020
National - Feb 16, 2020 , 01:47:32

రన్‌వేపై జీపు, వ్యక్తి..

రన్‌వేపై జీపు, వ్యక్తి..
  • పైలట్‌ అప్రమత్తతతో విమానానికి తప్పిన పెను ప్రమాదం

న్యూఢిలీ: ఎయిరిండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. పుణే విమానాశ్రయంలో విమానం టేకాఫ్‌ అవుతున్న సమయంలో ఒక జీపు, ఓ వ్యక్తి అకస్మాత్తుగా రన్‌వేపైకి రావడంతో వెంటనే అప్రమత్తమైన పైలట్‌ వారిని ఢీకొట్టకుండా ఉండేందుకు  విమానాన్ని ముందుగానే లిఫ్ట్‌ చేశారు. ఈ క్రమంలో విమానం కింది భాగం దెబ్బతిన్నది. అయినప్పటికీ అది ఢిల్లీ విమానాశ్రయంలో సురక్షితంగా దిగినట్లు ‘డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌' (డీజీసీఏ) అధికారి ఒకరు తెలిపారు. విచారణ నిమిత్తం విమానాన్ని సర్వీసు నుంచి ఉపసంహరించినట్లు చెప్పారు. ‘రన్‌వేపై ఏవైనా గుర్తులు పడ్డాయోమో గుర్తించేందుకు పుణే ఏటీసీ (ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌)తో సమన్వయం చేసుకోవాలని ఎయిరిండియాకు సూచించాం. అలాగే విశ్లేషణ కోసం విమానంలోని ‘కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌'ను తొలిగించాలని కోరాం’ అని ఆ అధికారి పేర్కొన్నారు.


logo