Air India Fined | వీల్‌చైర్ లేక ప్రయాణికుడు మృతిపై.. ఎయిర్ ఇండియాకు రూ.30 లక్షల జరిమానా
Air India Fined | వీల్‌చైర్ ఏర్పాటు చేయకపోవడంతో వృద్ధుడైన విమాన ప్రయాణికుడు మరణించాడు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఈ సంఘటనపై తీవ్రంగా స్పందించింది. ఎయిర్ ఇండియాకు రూ.30 లక్షల జరిమానా విధించింది.
న్యూఢిల్లీ: వీల్‌చైర్ ఏర్పాటు చేయకపోవడంతో వృద్ధుడైన విమాన ప్రయాణికుడు మరణించాడు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఈ సంఘటనపై తీవ్రంగా స్పందించింది. ఎయిర్ ఇండియాకు రూ.30 లక్షల జరిమానా విధించింది. (Air India Fined ) ఫిబ్రవరి 16న 80 ఏళ్ల వృద్ధుడు తన భార్యతో కలిసి ఎయిర్ ఇండియా విమానంలో న్యూయార్క్ నుంచి ముంబై చేరుకున్నాడు. అయితే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిన ఆ విమానం నుంచి టెర్మినల్ వరకు ఆయనకు వీల్‌చైర్ ఏర్పాటు చేయలేదు. దీంతో కొంత దూరం నడిచిన ఆ వృద్ధుడు తీవ్ర అస్వస్థతకు గురై మరణించాడు. ఈ సంఘటనపై డీజీసీఏ స్పందించింది. ఎయిర్ ఇండియాకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఏడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేసింది.
కాగా, ఈ సంఘటనపై ఎయిర్ ఇండియా వివరణ ఇచ్చింది. ఆ ప్రయాణికుడి భార్యకు వీల్‌చైర్ ఏర్పాటు చేసినట్లు తెలిపింది. వీల్‌చైర్స్ కొరత వల్ల ఏర్పాటు చేసే వరకు వేచి ఉండాలని ఆ వృద్ధుడ్ని కోరినట్లు చెప్పింది. అయితే వీల్‌చైర్‌లో ఉన్న భార్యతో కలిసి తాను నడిచి వెళ్తానని అతడు చెప్పినట్లు పేర్కొంది.
మరోవైపు ఎయిర్ ఇండియా వివరణపై డీజీసీఏ అసంతృప్తి వ్యక్తం చేసింది. వీల్‌చైర్ అవసరమైన దివ్యాంగుల పట్ల ఆ సంస్థ వ్యవహరించిన తీరుపై మండిపడింది. సంబంధిత నిబంధనలు ఉల్లంఘించిన ఎయిర్ ఇండియాకు రూ.30 లక్షల జరిమానా విధించింది. అలాగే వీల్‌చైర్ ప్రయాణికులకు వాటిని సమకూర్చడంపై విధి విధానాలు తప్పక పాటించాలని అన్ని విమానయాన సంస్థలకు సూచనలు జారీ చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
Shaurya Commandos: శౌర్య కమాండోలను రంగంలోకి దింపిన ఐటీబీపీ
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

