AIADMK MLA | అన్నాడీఎంకేకు మరో ఎమ్మెల్యే గుడ్‌బై.. ఐదుకు చేరిన రాజీనామాల సంఖ్య
AIADMK MLA | తమిళనాడు (Tamil Nadu) లో ప్రతిపక్ష అన్నాడీఎంకే (AIADMK) కు మరో ఎమ్మెల్యే గుడ్‌బై చెప్పారు. తమిళనాడు ఆరోగ్య శాఖ మాజీ మంత్రి, విరాలిమలై ఎమ్మెల్యే విజయ్ భాస్కర్ (Vijay Bhaskar) తన పదవికి రాజీనామా చేశారు. తమిళనాడు సచివాలయంలో అసెంబ్లీ స్పీకర్ (Assembly Speaker) జేసీడీ ప్రభాకర్ (JCD Prabhaker) ను కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు. స్పీకర్ ఆయన రాజీనామాను వెంటనే ఆమోదించారు.
AIADMK MLA : తమిళనాడు (Tamil Nadu) లో ప్రతిపక్ష అన్నాడీఎంకే (AIADMK) కు మరో ఎమ్మెల్యే గుడ్‌బై చెప్పారు. తమిళనాడు ఆరోగ్య శాఖ మాజీ మంత్రి, విరాలిమలై ఎమ్మెల్యే విజయ్ భాస్కర్ (Vijay Bhaskar) తన పదవికి రాజీనామా చేశారు. తమిళనాడు సచివాలయంలో అసెంబ్లీ స్పీకర్ (Assembly Speaker) జేసీడీ ప్రభాకర్ (JCD Prabhaker) ను కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు. స్పీకర్ ఆయన రాజీనామాను వెంటనే ఆమోదించారు.
అసెంబ్లీ ఎన్నికల అనంతరం అన్నాడీఎంకే ఎమ్మెల్యేల్లో పలువురు పళనిస్వామి నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వారంతా సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీలో చేరారు. తాజాగా మరో ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేశారు. వీళ్లాంతా గతంలో విజయ్ బలపరీక్ష సందర్భంగా కూడా ఆయనకు అనుకూలంగా ఓటు వేశారు.
ఇప్పుడు ఒక్కొక్కరుగా అన్నాడీఎంకేను వీడి టీవీకేలో చేరుతున్నారు. వీరంతా పదవులకు రాజీనామాలు చేసి టీవీకేలోకి వస్తుండటంతో త్వరలో పలు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఉప ఎన్నికలే గనుక జరిగితే అధికార టీవీకే సొంతంగా మ్యాజిక్ ఫిగర్‌ను దాటే అవకాశం ఉంది. కాగా టీవీకే హార్స్‌ట్రేడింగ్ ద్వారా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను కొంటూ ఎంజీఆర్ రాజకీయ వారసత్వాన్ని నాశనం చేస్తున్నారని అన్నాడీఎంకే ఆరోపిస్తోంది.
అయితే అన్నాడీఎంకే ఆరోపణలను టీవీకే కొట్టిపారేస్తోంది. తాము ఎలాంటి హార్స్ ట్రేడింగ్‌కు పాల్పడటం లేదని స్పష్టం చేసింది. పళనిస్వామి నాయకత్వంలో పనిచేయడం ఇష్టంలేక పలువురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఇష్టపూర్వకంగా టీవీకేలో చేరుతున్నారని పేర్కొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
కమీషన్ల సొమ్ము దాచుకునేందుకే ఎమ్మెల్యే కడియం విదేశీ యాత్రలు : తాటికొండ రాజయ్య
Cancer Prevention | క్యాన్సర్ నివారణ అంటే పొగ తాగడం, మద్యం మానేయడం కాదు.. వీటిని కూడా పాటించాలి..
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

