Taj Mahal | పర్యాటకులకు గుడ్‌న్యూస్.. ప్రేమ సౌధం తాజ్ మహల్‌ను చూసేందుకు ఫ్రీ ఎంట్రీ..!
Taj Mahal | ప్రేమ సౌధం తాజ్ మహల్‌ను వీక్షించాలనుకునే పర్యాటకులకు గుడ్‌న్యూస్. వరుసగా మూడురోజుల పాటు ఎలాంటి ఎంట్రీ ఫీజు చెల్లించకుండానే ఉచితంగానే ప్రవేశం కల్పించనున్నారు. మొఘల్ చక్రవర్తి షాజహాన్ 370వ ఉర్సు సందర్భంగా ఈ అవకాశం కల్పిస్తున్నారు.
Taj Mahal | ప్రేమ సౌధం తాజ్ మహల్‌ను వీక్షించాలనుకునే పర్యాటకులకు గుడ్‌న్యూస్. వరుసగా మూడురోజుల పాటు ఎలాంటి ఎంట్రీ ఫీజు చెల్లించకుండానే ఉచితంగానే ప్రవేశం కల్పించనున్నారు. మొఘల్ చక్రవర్తి షాజహాన్ 370వ ఉర్సు సందర్భంగా ఈ అవకాశం కల్పిస్తున్నారు. జనవరి 26 నుంచి 28 వరకు మూడురోజుల పాటు ఉర్సు జరుగనున్నది. ఈ సందర్భంగా పర్యాటకులకు ఉచితంగా తాజ్ మహల్ అందాలను వీక్షించే అవకాశం కల్పించారు. ఏటా షాజహాన్ వర్ధంతి సందర్భంగా ఉర్సు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ క్రమంలో మూడురోజుల పాటు పర్యాటకులు తాజ్ అందాలను చూసి అనుభూతి చెందే అవకాశం దక్కనున్నది.
అదే సమయంలో సందర్శకులు షాజహాన్తో పాటు ముంతాజ్ ఒరిజినల్ సమాధులను చూసేందుకు వీలుంటుంది. ఇతర సమయాల్లో సందర్శకులకు ఈ అవకాశం ఉండదు. ఉర్సు సమయంలోనే ప్రత్యేకంగా అండర్‌గ్రౌండ్ ద్వారాలను తెరుస్తారు. ఈ సమయంలోనే పర్యాటకులకు షాజహాన్, ముంతాజ్‌ల సమాధులను చూసే అవకాశం వస్తుంది. ఉర్సు తొలిరోజు సమాధులను శుద్ధి చేసి ప్రార్థనలు చేస్తారు. రెండోరోజు సుగంధ ద్రవ్య పరిమిళాల వేడుకలు జరుపుతారు. అలాగే ఖవ్వాలీ జరుగుతుంది. 28న ఖురాన్ఖ్వానీ, ఖుల్ కార్యక్రమాలు నిర్వహించి చాదర్‌ను అలంకరిస్తారు. మొదటి చాదర్‌ను ఉర్సు కమిటీ అందజేస్తుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

