37 Years In Bangladesh Jail | బంగ్లాదేశ్ జైళ్లలో 37 ఏళ్లు గడిపిన తర్వాత.. భారత్‌కు తిరిగి వచ్చిన వ్యక్తి
37 Years In Bangladesh Jail | ఒక వ్యక్తి బంగ్లాదేశ్ జైళ్లలో 37 ఏళ్లు గడిపాడు. చివరకు ఒక సంస్థ సహకారంతో భారత్‌కు తిరిగి వచ్చాడు. 62 ఏళ్ల వయసులో కుటుంబ సభ్యులను కలుసుకుని సంతోషం వ్యక్తం చేశాడు. పెద్ద వాడైన కుమారుడ్ని చూసి ఆనందం పట్టలేకపోయాడు.
అగర్తల: ఒక వ్యక్తి బంగ్లాదేశ్ జైళ్లలో 37 ఏళ్లు గడిపాడు. (37 Years In Bangladesh Jail) చివరకు ఒక సంస్థ సహకారంతో భారత్‌కు తిరిగి వచ్చాడు. 62 ఏళ్ల వయసులో కుటుంబ సభ్యులను కలుసుకుని సంతోషం వ్యక్తం చేశాడు. పెద్ద వాడైన కుమారుడ్ని చూసి ఆనందం పట్టలేకపోయాడు. త్రిపురలోని సెపాహిజాలా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సోనామురా సబ్‌డివిజన్‌లోని సరిహద్దు గ్రామం రవీంద్రనగర్‌లో నివసిస్తున్న 25 ఏళ్ల షాజహాన్, 1988లో బంగ్లాదేశ్ కొమిల్లాలోని తన అత్తమామల ఇంటికి వెళ్లాడు. అయితే ఆ ఇంటిపై బంగ్లాదేశ్ పోలీసులు రైడ్ చేశారు. దేశంలోకి అక్రమంగా ప్రవేశించినందుకు షాజహాన్‌ను అరెస్ట్ చేశారు. ఆ సమయంలో ఆయన భార్య గర్భవతి.
కాగా, బంగ్లాదేశ్‌లోని కొమిల్లా కోర్టు షాజహాన్‌కు 11 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ఆ జైలు శిక్ష ముగిసినప్పటికీ అతడ్ని విడిచిపెట్టలేదు. తప్పుడు ఆరోపణలతో ఇతర జైళ్లకు తరలించారు. దీంతో అదనంగా 26 సంవత్సరాలు బంగ్లాదేశ్ జైళ్లలో గడిపాడు. ఈ నేపథ్యంలో షాజహాన్‌కు జరిగిన అన్యాయం గురించి మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో అతడి దుస్థితి గురించి జారా ఫౌండేషన్‌కు తెలిసింది.
మరోవైపు విదేశాల్లో చిక్కుకున్న వలసదారులకు సహాయం చేసే ఈ సంస్థ షాజహాన్ విడుదలకు చాలా కృషి చేసింది. అనేక చట్టపరమైన చర్యల తరువాత బంగ్లాదేశ్ పోలీసులు, అధికారులు అతడ్ని విడుదల చేశారు. దీంతో మంగళవారం శ్రీమంతపూర్ ఎల్సీఎస్ వద్ద బీఎస్ఎఫ్ ఇబ్బందికి ఆయనను అప్పగించారు.
ఈ నేపథ్యంలో 37 ఏళ్ల తర్వాత సొంతూరుకు చేరుకున్న షాజహాన్ తన కుటుంబ సభ్యులను కలుసుకున్నాడు. పెద్ద వాడైన తన కుమారుడ్ని తొలిసారి చూసి ఆనందం పట్టలేకపోయాడు. ఈ జన్మలో ఇంటి తిరిగి వస్తానని అనుకోలేదని తెలిపాడు. తనను ఇంటికి చేర్చిన జరా ఫౌండేషన్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- 37 Years
- bangladesh
- Indian man
- Jail
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

