BJP leader’s daughter wedding | విమర్శలతో వెనక్కి తగ్గిన బీజేపీ నేత.. ముస్లిం వ్యక్తితో కుమార్తె పెళ్లి రద్దు
BJP leader's daughter wedding | ముస్లిం వ్యక్తితో కుమార్తెకు పెళ్లిపై బీజేపీ నేత (BJP leader's daughter wedding) వెనక్కి తగ్గారు. విమర్శల నేపథ్యంలో ఈ నెల 28న జరుగనున్న వివాహాన్ని ప్రస్తుతానికి రద్దు చేసినట్లు మీడియాకు తెలిపారు. అయితే ఇరు కుటుంబాలు, శ్రేయోభిలాషులతో చర్చించిన తర్వాత ఆ జంట పెళ్లిపై తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
డెహ్రాడూన్: ముస్లిం వ్యక్తితో కుమార్తెకు పెళ్లిపై బీజేపీ నేత (BJP leader’s daughter wedding) వెనక్కి తగ్గారు. విమర్శల నేపథ్యంలో ఈ నెల 28న జరుగనున్న వివాహాన్ని ప్రస్తుతానికి రద్దు చేసినట్లు మీడియాకు తెలిపారు. అయితే ఇరు కుటుంబాలు, శ్రేయోభిలాషులతో చర్చించిన తర్వాత ఆ జంట పెళ్లిపై తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. బీజేపీ పాలిత ఉత్తరాఖండ్‌లో ఈ సంఘటన జరిగింది. పౌరీ గర్వాల్‌కు చెందిన బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ యశ్పాల్ బెనమ్ తన కుమార్తెకు ముస్లిం వ్యక్తితో పెళ్లి చేయాలని నిశ్చయించారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నో యూనివర్సిటీలో చదివిన ఆమెకు ఆ ముస్లిం యువకుడి మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది. ఈ నేపథ్యంలో ఈ జంటకు పెళ్లి చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయించాయి.
కాగా, పౌరీ గర్వాల్లోని రిసార్ట్‌లో ఈ నెల 28న జరుగనున్న ఈ వివాహానికి సంబంధించిన వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో హిందూ సంఘాలతో పాటు నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పెళ్లిని వ్యతిరేకిస్తూ వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ నిరసనలు చేపట్టాయి. హిందుత్వాన్ని కాపాడాల్సిన బీజేపీ నేతలు తమ కుమార్తెలను ముస్లిం వ్యక్తులకు ఇచ్చి పెళ్లి చేయడంపై హిందూ సంఘాల నేతలు మండిపడ్డారు. యశ్పాల్ బెనమ్ను బీజేపీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
మరోవైపు ఈ పెళ్లిపై నెటిజన్లు కూడా స్పందించారు. ‘ది కేరళ స్టోరీ’ సినిమా వివాదం నేపథ్యంలో ఇది ‘లవ్ జిహాద్ కాదా?’ అని కొందరు ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ‘లవ్ జిహాద్’కు వ్యతిరేకంగా చట్టాలు చేస్తున్న బీజేపీ నేతలు తమ కుమార్తెలను మాత్రం ముస్లిం వ్యక్తులకు ఇచ్చి పెళ్లి చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల జిమిక్కుగా మరి కొందరు విమర్శించారు. అయితే కొందరు మాత్రం ఈ పెళ్లిని సమర్థించారు. ఇలాంటి వివాహాలతో సమాజంలో మత విద్వేషాలు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు.
ఈ వివాదం నేపథ్యంలో బీజేపీ నేత యశ్పాల్ బెనమ్ వెనక్కి తగ్గారు. ఈ నెల 28న తన కుమార్తెకు ముస్లిం వ్యక్తితో జరుగాల్సిన పెళ్లిని రద్దు చేసినట్లు మీడియాకు తెలిపారు. ప్రజాప్రతినిధిని కావడంతో పోలీసులు, అధికార యంత్రాంగం రక్షణలో కూతురి పెళ్లి జరగడం తనకు ఇష్టం లేదని చెప్పారు. ప్రజల మనోభావాలను తాను గౌరవిస్తానని అన్నారు.
ఇరు కుటుంబాల అంగీకారం మేరకు ఈ పెళ్లికి అంగీకారం కుదిరిందని బీజేపీ నేత యశ్పాల్ బెనమ్ తెలిపారు. వెడ్డింగ్ కార్డు బయటకు రావడంతో కొన్ని విషయాలు తెరపైకి వచ్చాయని అన్నారు. ఈ వివాదం నేపథ్యంలో పరస్పర అంగీకారంతో ప్రస్తుతం ఈ పెళ్లిని విరమించుకున్నట్లు చెప్పారు. అయితే ఆ (ముస్లిం) వ్యక్తితో తన కుమార్తె పెళ్లి విషయంపై కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, వరుడి తరఫు వారితో కలిసి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

