Uber Auto | ఉబర్ నిర్వాకం.. 10 కిలోమీటర్ల దూరానికి రూ.కోటి ఛార్జ్
Uber Auto | ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఉబర్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఓ కస్టమర్‌కు కేవలం 10 కిలోమీటర్ల దూరానికి ఏకంగా రూ.కోటికి పైనే ఛార్జ్ వచ్చింది.
Uber Auto | ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఉబర్ మరోసారి వార్తల్లో నిలిచింది. మొన్నటికి మొన్న నోయిడాకు చెందిన దీపక్ టెంగూరియా అనే వ్యక్తికి ఉబర్ రైడ్‌కు (Uber Auto Ride) ఏకంగా రూ.7.66 కోట్ల బిల్లు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఉబర్ కస్టమర్‌కు అలాంటి అనుభవమే ఎదురైంది. కేవలం 10 కిలోమీటర్ల దూరానికి ఏకంగా రూ.కోటికి పైనే ఛార్జ్ వచ్చింది.
హైదరాబాద్‌కు చెందిన ఫుడ్ వ్లాగర్ శ్రీరాజ్ నీలేష్ తన భార్యతో కలిసి బెంగళూరులో (Bengaluru) ఉబర్ ఆటోలో ప్రయాణించాడు. వీరు కేఆర్‌పురంలోని టిన్ ఫ్యాక్టరీ నుంచి కోరమంగళ వెళ్లేందుకు ఉబర్‌లో ఆటో బుక్ చేసుకున్నారు. అయితే, ఆటో బుక్ చేసుకునే సమయంలో వారికి పది కిలోమీటర్ల దూరానికి కేవలం రూ.207 మాత్రమే చూపించింది. గమ్యస్థానానికి చేరుకుని బిల్లు చూడగా.. రూ.కోటికిపైనే ఉంది.
ట్రిప్ ఫేర్‌గా రూ.8,96,817ఛార్జ్ చేయగా, వెయిటింగ్ కోసం రూ.9,414,275గా చూపించింది. ఇక ప్రొమోషన్ కాస్ట్ రూ.38పోగా మొత్తం రూ.1,03,11,055పే చేయాలని ఉబర్ యాప్‌లో కనిపించింది. ఇది చూసిన ఆ జంట ఒక్కసారిగా షాక్ అయ్యారు. వారే కాదు ఆటో డ్రైవర్ కూడా షాక్‌లో ఉండిపోయాడు. దీంతో అతడు వెంటనే కస్టమర్ కేర్‌కు కాల్ చేయగా.. అటువైపు నుంచి ఎలాంటి స్పందనా లేదు. దీంతో ఉబర్ బాధితుడు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘పది కిలోమీటర్ల దూరానికి ఉబర్ నాకు రూ.కోటి బిల్లు వేసింది’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వారం వ్యవధిలోనే ఇది రెండో ఘటన కావడం గమనార్హం. ఇటీవలే నోయిడా వ్యక్తికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైన విషయం తెలిసిందే.
రూ.7.66 కోట్లలో ఫేర్
ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన దీపక్ టెంగూరియా శుక్రవారం తెల్లవారుజామున ఉబర్ యాప్ ద్వారా ఆటో బుక్ చేశాడు. తాను చేరాల్సిన ప్రాంతానికి రూ.62 చెల్లించాలని తొలుత అందులో చూపించింది. ఆటోలో ప్రయాణించిన దీపక్ ఆ ప్రాంతానికి చేరక ముందు ఉబర్ యాప్‌ను మరోసారి చెక్ చేశాడు. అయితే మొత్తం రూ.7,66 కోట్లకుపైగా చెల్లించాలని అందులో ఉండటం చూసి అతడు షాక్ అయ్యాడు. ట్రిప్ ఫేర్‌గా రూ.1,67,74,647 ఛార్జ్ చేయగా, వెయిటింగ్ కోసం రూ.5,99,09,189, ప్రొమోషన్ కాస్ట్ రూ.75తో కలిసి మొత్తం రూ.7,66 ,83,762 పే చేయాలని ఉబర్ యాప్‌లో కనిపించింది. ఎలాంటి జీఎస్టీ విధించలేదు. ఇది చూసి అతడు షాక్ అయ్యాడు. రైడ్ మధ్యలోనే ఆటో దిగిపోయాడు.
Also Read..
Arvind Kejriwal | లాకెట్, మందులు, పుస్తకాలు.. కోర్టుకు కేజ్రీవాల్ అభ్యర్థనలు
Pakistan PM | పాక్ ప్రధాని కీలక నిర్ణయం.. రెడ్ కార్పెట్లపై నిషేధం..!
Pakistan | బాంబు నిర్వీర్య బృందమే లక్ష్యంగా కాల్పులు.. ఇద్దరు సైనికులు మృతి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

