Warships: ఆరేబియా సముద్రంలో 3 యుద్ధ నౌకల మోహరింపు
Warships: ఆరేబియా సముద్రంలో మూడు యుద్ధ నౌకలను భారతీయ నౌకాదళం మోహరించింది. శనివారం భారతీయ నౌకపై డ్రోన్ అటాక్ జరిగిన నేపథ్యంలో నేవీ ఈ చర్యకు పాల్పడింది. ఐఎన్ఎస్ మార్మగోవా, ఐఎన్ఎస్ కొచ్చి, ఐఎన్ఎస్ కోల్‌కతా యుద్ధ నౌకలతో ఆరేబియా సముద్రంలో నిఘా పెట్టినట్లు నేవీ వెల్లడించింది.
న్యూఢిల్లీ: కెమికల్ ట్యాంక్ ఎంవీ చెమ్ ప్లూటోపై ఆరేబియా సముద్రంలో డ్రోన్ అటాక్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ముంబై తీరం చేరుకున్న ఆ నౌకపై ఫోరెన్సిక్ దర్యాప్తు జరుగుతోంది. దాడి ఎక్కడ నుంచి జరిగింది, ఎటువంటి పేలుళ్లను వాడారన్న కోణంలో విచారణ సాగుతోంది. ఈ నేపథ్యంలో భారతీయ నౌకాదళం కీలక ప్రకటన చేసింది. ఐఎన్ఎస్ మార్మగోవా, ఐఎన్ఎస్ కొచ్చి, ఐఎన్ఎస్ కోల్‌కతా యుద్ధ నౌకల(Warships)ను ఆరేబియా సముద్రంలో నిఘా పెట్టినట్లు నేవీ వెల్లడించింది.
వాణిజ్య నౌకలపై ఆరేబియా సముద్రంలో అటాక్ జరుగుతున్న నేపథ్యంలో పీ-8ఐ లాంగ్ రేంజ్ పెట్రోలింగ్ విమానాలను కూడా నిఘా కోసం వాడుతున్నారు. ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఎడెన్ ప్రాంతంలో ఇరాన్ మద్దతు ఇస్తున్న హౌతీ మిలిటెంట్లు దాడులు చేస్తున్నారు. ఆ ఉగ్రవాదులే వాణిజ్య నౌకలను టార్గెట్ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.
ఎంవీ చెమ్ ప్లూ నౌక సౌదీ అరేబియాలోని ఏ1 జుబెల్ పోర్టు నుంచి న్యూ మంగళపూరు పోర్టుకు క్రూడ్ ఆయిల్‌ను తీసుకువస్తోంది. అయితే పోరుబందర్‌కు 217 నాటికల్ మైళ్ల దూరంలో ఆ నౌకపై అటాక్ జరిగింది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

