రాజకీయ విరాళాల్లో 82% బీజేపీకే!
2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎలక్టోరల్ ట్రస్ట్‌ల ద్వారా బీజేపీకి రూ. 3,157.65 కోట్లు రాజకీయ విరాళాలుగా అందాయి. ఆ ఏడాది అన్ని రాజకీయ పార్టీలకు అందిన విరాళాల్లో ఇది 82.52 శాతం.
- 2024-25 ఎలక్టోరల్ ట్రస్ట్‌ల విరాళాలపై ఏడీఆర్ నివేదిక
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎలక్టోరల్ ట్రస్ట్‌ల ద్వారా బీజేపీకి రూ. 3,157.65 కోట్లు రాజకీయ విరాళాలుగా అందాయి. ఆ ఏడాది అన్ని రాజకీయ పార్టీలకు అందిన విరాళాల్లో ఇది 82.52 శాతం. ఈ మేరకు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) శుక్రవారం ఓ నివేదికలో వెల్లడించింది.
20 ఎలక్టోరల్ ట్రస్ట్ సంస్థలు ఈ విరాళాలను వివిధ పార్టీలకు అందజేయగా, 5 సంస్థలు తమ వివరాలను వెల్లడించలేదని ఏడీఆర్ పేర్కొన్నది. ఆ వివరాలు కూడా బయటపడితే, బీజేపీకి వచ్చిన విరాళాలు మరింత పెరిగే అవకాశమున్నదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కాగా.. 2018-2024 మధ్య కాలంలో రాజకీయ పార్టీలు విరాళాలను ఎలక్టోరల్ బాండ్ల ద్వారా సేకరిస్తూ ఉండేవి. ఈ బాండ్ల పథకాన్ని సుప్రీంకోర్టు 2024 ఫిబ్రవరిలో రద్దు చేసింది.
అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వ కాంట్రాక్టులు దక్కించుకున్న కార్పొరేట్ స ంస్థలు రాజకీయ విరాళాలు ఇవ్వడానికి ఎలక్టోరల్ ట్రస్ట్‌ల బాట పట్టాయి. ఫలితంగా అత్యధిక రాజకీయ విరాళ దాతలుగా ఎలక్టోరల్ ట్రస్టులు నిలిచా యి. వీటిల్లో ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ అగ్రస్థానంలో ఉంది. ఇది 15 రాజకీయ పార్టీలకు 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,668.46 కోట్లను విరాళాలుగా ఇచ్చింది.

Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

