విదేశీ నిధులు సీజ్.. అదానీ కంపెనీ షేర్లు పతనం

ముంబై : అదానీ కంపెనీ షేర్లు దారుణంగా పడిపోయాయి. సుమారు 25 శాతం వరకు ఆ కంపెనీల షేర్లు పతనమైనట్లు తెలుస్తోంది. అదానీ గ్రూపుకు చెందిన సుమారు 43వేల కోట్ల విలువైన మూడు కంపెనీల విదేశీ నిధులను నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ సీజ్ చేయడంతో ఆ కంపెనీ షేర్లు డౌనయ్యాయి. అల్బులా ఇన్వెస్ట్మెంట్ ఫండ్, క్రెస్టా ఫండ్, ఏపీఎంఎస్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కంపెనీల నిధులను ఎన్ఎస్డీఎల్ నిలిపివేసింది. గత ఏడాది సుమారు 800 శాతం దూసుకువెళ్లిన అదానీ గ్రూపు ఇప్పుడు ఒకేసారి బోల్తాకొట్టింది. పీఎంఎల్ఏ చట్టం ప్రకారం ఆ మూడు విదేశీ కంపెనీల వివరాలను ఆదానీ గ్రూపు వెల్లడించలేదు. దీంతో నేషనల్ సెక్యూరిటీస్ చర్యలు తీసుకున్నది.
గత దశాబ్ధ కాలంలో అదానీ షేర్లు పతనం కావడం ఇదే మొదటిసారి. అదానీ పోర్ట్స్ 19 శాతం పతనమైనట్లు నిఫ్టీ పేర్కొన్నది. ఇటీవల అదానీ షేర్లు దూసుకెళ్లడంతో.. దాని చైర్మెన్ గౌతమ్ అదానీ .. ఆసియాలో రెండవ సంపన్న వ్యక్తిగా నిలిచారు. అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు గత ఏడాది కాలంలో పది రేట్లు పెరిగాయి. అదానీ ట్రాన్స్మిషన్ షేర్లు కూడా ఎనిమిది రేట్లు పెరిగాయి. అదానీ పోర్ట్స్ 148 శాతం, అదానీ గ్రీన్ 267 శాతం గత ఏడాది పెరిగాయి. అయితే ఇవాళ షేర్లు పతనమైన అంశంపై అదానీ కంపెనీ స్పందించలేదు. సెబీ, ఎన్ఎస్డీఎల్ కూడా ఇంకా కామెంట్ చేయలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

