కోల్కతా, ఫిబ్రవరి 15: నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మిమీ చక్రవర్తి తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామాను బెంగాల్ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి సమర్పించారు. అయితే ఆమె రాజీనామాను మమత అంగీకరించ లేదు. స్థానిక తృణమూల్ కాంగ్రెస్ నేతలతో విభేదాల కారణంగానే తాను పదవికి రాజీనామా చేశానని మిమీ చెప్పారు.
ఇంతకు రెండు రోజుల ముందే ఆమె పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ పదవులకు రాజీనామా చేశారు. ‘జాదవ్పూర్ అభివృద్ధికి నేను చాలా కలలు కన్నా. అయితే సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి రాజకీయాలకు పనికిరారంటూ నన్ను హేళన చేశారు. రాజకీయాల్లో నైతికత ఏంటన్నది నాకు అర్థం కావడం లేదు’ అని ఆమె అన్నారు.