Teesta Setalvad | తీస్తా సెతల్వాద్‌కు ఊరట.. బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు..
న్యూఢిల్లీ: 2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించిన కేసులో హక్కుల కార్యకర్త తీస్తా సెతల్వాద్‌కు సుప్రీంకోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. ఆమెకు బెయిల్ నిరాకరిస్తూ గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ధర్మాసనం పక్కనపెట్టింది.
న్యూఢిల్లీ: 2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించిన కేసులో హక్కుల కార్యకర్త తీస్తా సెతల్వాద్‌కు సుప్రీంకోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. ఆమెకు బెయిల్ నిరాకరిస్తూ గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పును జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడి త్రిసభ్య ధర్మాసనం పక్కనపెట్టింది. హైకోర్టు నిర్ణయం హేతబద్ధంగా లేదని కోర్టు అభిప్రాయపడింది. ‘హైకోర్టు తీర్పును రద్దుచేస్తున్నాం. అరెస్ట్ నుంచి సెతల్వాద్ కల్పించిన రక్షణను పొడిగిస్తున్నాం. అలాగే సాక్ష్యులను ప్రభావితం చేసేందుకు సెతల్వాద్ ప్రయత్నించరాదు’ అని కోర్టు ఆదేశించింది.
విచారణ సందర్బంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సెతల్వాద్‌ను అరెస్ట్ చేసిన సమయం, అరెస్ట్ వెనుక ఉద్దేశంపై ప్రశ్నలు లేవనెత్తింది. ‘2022 వరకు మీరు ఏం చేస్తున్నారు?’ అంటూ పోలీసులను ప్రశ్నించింది. గుజరాత్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు, ముఖ్యమంత్రిని అప్రతిష్టపాలు చేసేందుకు గోద్రా అల్లర్ల బాధితులతో కలిసి సుప్రీంకోర్టుకు తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేశారన్న ఆరోపణలపై తీస్తా సెతల్వాద్‌ను గత ఏడాది జూన్‌లో గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను గుజరాత్ హైకోర్టు తోసిపుచ్చడంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

