Kejriwal | జైల్లో పెట్టినా.. మీరే సీఎం.. సీఎం కేజ్రీవాల్‌తో ఆప్ ఎమ్మెల్యేలు
Kejiriwal | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సోమవారం పార్టీ ఎమ్మెల్యేలతో కీలక సమావేశం నిర్వహించారు.
Kejriwal | న్యూఢిల్లీ, నవంబర్ 6: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సోమవారం పార్టీ ఎమ్మెల్యేలతో కీలక సమావేశం నిర్వహించారు. ఒక వేళ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసినా, ముఖ్యమంత్రిగా ఆయనే కొనసాగాలని పార్టీ ఎమ్మెల్యేలంతా ముక్తకంఠంతో కోరినట్టు ఆప్ వెల్లడించింది. గతవారం కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు జారీచేసిన విషయం తెలిసిందే. అయితే ఈడీ ఆరోపణల్ని రాజకీయ ప్రేరేపితంగా పేర్కొంటూ సమన్లను ఆయన తిరస్కరించారు. నవంబర్ 2 నాటి ఈడీ విచారణకు హాజరుకాలేదు.
జైల్లోనే క్యాబినెట్ భేటీ నిర్వహిస్తాం
సమావేశ వివరాల్ని ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ మీడియాకు వెల్లడించారు. ‘కేజ్రీవాల్‌ను ఎన్నికల్లో ఓడించటం సాధ్యం కాదని గ్రహించిన బీజేపీ, కుట్రపూరిత చర్యలకు పాల్పడుతున్నది. కేజ్రీవాల్ అరెస్టయితే.. ప్రభుత్వ అధికారులు జైలుకు వెళ్లి సీఎంతో సమావేశమవుతారు. పరిస్థితులు చూస్తుంటే మమ్మల్ని కూడా జైల్లో పెట్టొచ్చు. అప్పుడు మేమంతా జైల్లోనే క్యాబినెట్ సమావేశాలు నిర్వహిస్తాం. అప్పుడు కూడా ఢిల్లీ ప్రభుత్వ పనులు మాత్రం ఆగవు’ అని భరద్వాజ్ అన్నారు. ఎన్నికల ముంగిట ఈడీని అడ్డుపెట్టుకుని విపక్ష నేతలను కేంద్రం వేధిస్తున్నదని ఆప్ ఆగ్రహం వ్యక్తంచేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

