చిక్కుల్లో ఆప్ ఎమ్మెల్యే : రెండో భార్యతో సన్నిహితంగా ఉన్న వీడియో వైరల్!
సనౌర్కు చెందిన ఆప్ ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ పఠన్‌మజ్రా (46) ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. మొదటి భార్యతో వైవాహిక బంధం కొనసాగిస్తునే తనను పెండ్లి చేసుకున్నాడని రెండవ భార్య ఆరోపించింది.
న్యూఢిల్లీ : సనౌర్కు చెందిన ఆప్ ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ పఠన్‌మజ్రా (46) ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. మొదటి భార్యతో వైవాహిక బంధం కొనసాగిస్తునే తనను పెండ్లి చేసుకున్నాడని రెండవ భార్య ఆరోపించింది. మరోవైపు రెండో భార్యతో ఆయన సన్నిహితంగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హర్మీత్ మొదటి పెండ్లిని దాచి రెండో వివాహం చేసుకున్నాడని ఆరోపణలు వచ్చాయి. అయితే మొదటి భార్యతో చట్టబద్ధంగా విడిపోయిన తర్వాతే రెండో వివాహం చేసుకున్నానని హర్మీత్ చెప్పుకొచ్చారు. ఆప్ ఎమ్మెల్యే హర్మీత్ మొదటి వివాహాన్ని దాచి రెండో పెండ్లి చేసుకున్నాడని ఆయన రెండవ భార్య జికార్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
ఇక తనకు తెలియకుండానే రెండవ భార్యతో సన్నిహితంగా ఉన్న వీడియోను రికార్డు చేశారని, ఈ వీడియోను రెండవ భార్య దుర్వినియోగం చేస్తూ లీక్ చేసిందని హర్మీత్ ఆరోపించారు. తనకు ఇన్ఫెక్షన్ సోకడంతో రెండవ భార్యకు వీడియో కాల్ ద్వారా చూపించానని తన శరీర భాగాలు ఆ వీడియో కనిపించడంపై ఆప్ ఎమ్మెల్యే వివరణ ఇచ్చారు. ఇది తనకు వ్యతిరేకంగా జరిగిన కుట్రని ఆయన ఆరోపించారు. భార్యాభర్తలు సన్నిహితంగా ఉండేలా ఎన్నో క్షణాలను పంచుకుంటారని, ఆమె తన వీడియో కాల్ రికార్డు చేస్తుందని తనకు తెలియదని చెప్పారు.
ఆమె ఈ వీడియోను ఇప్పడు వైరల్ చేసి తన ప్రతిష్టను దెబ్బతీసిందని వాపోయారు. ఇక 2021 ఆగస్ట్ 14న తాము వివాహం చేసుకున్నామని, ఇందుకు సంబంధించి మ్యారేజ్ సర్టిఫికెట్ సహా అన్ని పత్రాలూ ఉన్నాయని ఆయన రెండో భార్య గురుప్రీత్ కౌర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మొదటి భార్యకు విడాకులు ఇచ్చానని, మన వివాహం చట్టప్రకారం చెల్లుబాటు అవుతుందని వివాహ సమయంలో హర్మీత్ తనకు చెప్పాడని ఆమె వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

