గన్ పట్టుకుని డ్యాన్స్.. ఆప్ అభ్యర్థిపై కేసు
వైరల్ అయిన ఈ వీడియో ఢిల్లీ పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో రివాల్వర్ పట్టుకుని డ్యాన్ చేసిన ఆప్ అభ్యర్థి జోగిందర్ సింగ్‌పై కేసు నమోదు చేశారు.
న్యూఢిల్లీ: చేతిలో తుపాకీ పట్టుకుని డ్యాన్స్ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అభ్యర్థిపై కేసు నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ఆప్ నేత జోగిందర్ సింగ్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల్లో 19వ వార్డు అయిన స్వరూప్ నగర్ నుంచి పోటీ చేస్తున్నారు. కాగా, పసుపుపచ్చని టీ షర్ట్ ధరించిన ఆయన తన అనుచరులతో కలిసి డ్యాన్స్ చేశారు. ఈ సందర్భంగా తన వద్ద ఉన్న గన్ను బయటకు తీసి దానిని చూపుతూ డ్యాన్స్ చేశారు. అక్కడున్న వారు తమ మొబైల్ ఫోన్లలో దీనిని రికార్డు చేశారు. అనంతరం సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఈ వీడియో వైరల్ అయ్యింది.
కాగా, వైరల్ అయిన ఈ వీడియో ఢిల్లీ పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో రివాల్వర్ పట్టుకుని డ్యాన్ చేసిన ఆప్ అభ్యర్థి జోగిందర్ సింగ్‌పై కేసు నమోదు చేశారు. ఆయుధ చట్టంలోని సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
మరోవైపు ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్న 250 వార్డులున్న మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ)కి డిసెంబర్ 7న ఓటింగ్ జరుగనుంది. డిసెంబర్ 7న ఫలితాలు వెల్లడిస్తారు. కాగా, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ మధ్య గట్టి పోటీ నెలకొన్నది.
यह लीजिए मिलिये – Revolver Dance करते @ArvindKejriwal के सिपाही Joginder Singh से जो Ward 19 से @AamAadmiParty प्रत्याशी हैं।
आप सोच सकते हैं की — यह Revolver धारी अगर पार्षद बने तो कैसी जनसेवा करेंगे ?@BJP4Delhi @ManojTiwariMP @neelkantbakshi @gauravkharibjp @rohitTeamBJP pic.twitter.com/7EPKssLMMY
— Praveen Shankar Kapoor (@praveenskapoor) November 28, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

