Arvind Kejriwal | నేడు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయనున్న ఈడీ?.. ఆప్ నేతల ఆందోళన
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆప్ కన్వీనర్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను (Arvind Kejriwal) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) నేడు అరెస్టు చేయనుందా.. అంటే అవుననే అంటున్నాయని ఆ పార్టీ వర్గాలు.
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆప్ కన్వీనర్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను (Arvind Kejriwal) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) నేడు అరెస్టు చేయనుందా.. అంటే అవుననే అంటున్నాయని ఆ పార్టీ వర్గాలు. గురువారం ఉదయం ఆయనను ఈడీ అదుపులోకి తీసుకోనుందంటూ ఆప్ (AAP) నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు తమకు సమాచారం అందిందంటూ పార్టీ నాయకులు అతిశి, సౌరభ్ భరద్వాజ్, జాస్మిన్ షా సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెళ్లడించారు.
గురువారం ఉదయం కేజ్రీవాల్ ఇంటిపై ఈడీ దాడులు చేయనుందని వార్తలు వస్తున్నాయి. అ సందర్భంగా సీఎంను అరెస్టు చేసే అవకాశం ఉందంటూ బుధవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత మంత్రి అతిశి ట్వీట్ చేశారు. ‘బ్రేకింగ్ న్యూస్.. ఉదయం సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటిపై దాడి చేయనున్నట్లు ఈడీ వర్గాలు దృవీకరించాయి. అరెస్టు చేసే అవకాశం ఉంది’ అని షా రాసుకొచ్చారు. కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడానికి ఈడీ ఆయన ఇంటికి వెళ్లనుందంటూ భరద్వాజ్ ట్వీట్ చేశారు. కాగా, ముఖ్యమంత్రి అధికార నివాసానికి వెళ్లే రోడ్లను ఢిల్లీ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. భారీగా పోలీసులను మోహరించారు. దీంతో ఆయన అరెస్టుపై తమ అనుమానాలకు బలం చేకూరిందంటూ పార్టీ నాయకులు అంటున్నారు.
కాగా, ఈడీ ముందు హాజరు కావడానికి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మరోసారి నిరాకరించిన విషయం తెలిసిందే. ఇప్పటికే మద్యం కేసులో ఈడీ రెండుసార్లు జారీ చేసిన నోటీసులను లెక్క చేయని ఆయన.. మూడోసారి జారీ చేసిన సమన్లపై స్పందిస్తూ దర్యాప్తు సంస్థకు లేఖ రాశారు. రాబోయే రాజ్యసభ ఎన్నికల్లో తలమునకలై ఉన్నానని, రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా అనేక ముఖ్య కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉన్నందున ఈడీ విచారణకు రాలేనని, ఈడీ తాను అడగాల్సిన ప్రశ్నలను పంపితే సమాధానం ఇవ్వడానికి గానీ, అవసరమైన పత్రాలు సమర్పించడానికి గాని తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు.
అసలు తనను విచారణకు పిలవడానికి నిజమైన కారణం, పరిధి, స్వభావం, ఉద్దేశం తెలియజేయాలంటూ గతంలో రాసిన లేఖలపై దర్యాప్తు సంస్థ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై ఈడీ మౌనం చూస్తుంటే ఏదో అవాంఛనీయ రహస్యాన్ని దాయడమే కాక, అపారదర్శకంగా, పక్షపాతంతో ఉన్నట్టు అనుమానాలు కలిగిస్తున్నాయన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- AAP
- arrest
- Arvind Kejriwal
- Atishi
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

