Kerala Woman | కేరళలో ఘోరం.. మహిళను బలితీసుకున్న బిర్యానీ..!
Kerala Woman | కేరళలో ఘోరం జరిగింది. ఇష్టంగా తిన్న బిర్యానీ ఓ మహిళ ప్రాణాలు తీసింది. త్రిసూర్ జిల్లాలోని పెరింజనం పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక రెస్టారెంట్లో బిర్యానీ తిన్న సుమారు 178 మందికి ఫుడ్ పాయిజనింగ్ అయ్యింది. వారిలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది.
Kerala Woman : కేరళలో ఘోరం జరిగింది. ఇష్టంగా తిన్న బిర్యానీ ఓ మహిళ ప్రాణాలు తీసింది. త్రిసూర్ జిల్లాలోని పెరింజనం పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక రెస్టారెంట్లో బిర్యానీ తిన్న సుమారు 178 మందికి ఫుడ్ పాయిజనింగ్ అయ్యింది. వారిలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. కుటిలక్కడవ్‌కి చెందిన నుసైబా (56) బిర్యానీ తిన్న తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆమెను స్థానికంగా ఉన్న ఆరోగ్య కేంద్రానికి, అక్కడి నుంచి ఇరింజలకుడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
ఆ తర్వాత మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ నుసైబా మంగళవారం మరణించారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. మరణానికి కారణాలపై శాస్త్రీయ పరిశోధన జరగనుంది. ఫుడ్ పాయిజన్ అయిందన్న అనుమానంతో పోలీసులు, ఆరోగ్య శాఖ అధికారులు, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ప్రతినిధులు, పంచాయతీ అధికారులు, పోలీసులతో కలిసి రెస్టారెంట్లో తనిఖీలు నిర్వహించారు. ఈ ఘటనపై స్థానిక అధికారులు స్పందించి రెస్టారెంట్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
అపరిశుభ్రతతో హోటల్ నిర్వహిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు. ఈ విషయంపై కయపమంగళం పోలీస్‌స్టేషన్, పెరింజనం పట్టణ పంచాయతీలో ఫిర్యాదు చేశారు. ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఆస్పత్రిలో చేరిన వారిని కలుసుకుని సమాచారాన్ని సేకరించారు. రెస్టారెంట్‌లోని మయోనీస్, కేరళలో ప్రసిద్ధి చెందిన బిర్యానీ లాంటి యెమెన్ వంటకం ‘కుజి మండి’ తినడంవల్లే మహిళ మరణించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది పెరింజనం, కయపమంగళానికి చెందినవారే.
కేరళ ప్రభుత్వం ఫుడ్ పాయిజనింగ్ కేసుల కారణంగా 2023 జనవరిలో రాష్ట్రవ్యాప్తంగా రెస్టారెంట్లలో గుడ్లతో తయారు చేసిన మయోనీస్ను నిషేధించింది. అప్పట్లో కాసర్‌గోడ్‌కు చెందిన అంజు శ్రీపార్వతి అనే 20 ఏళ్ల యువతి రెస్టారెంట్లో మండి తిని మరణించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు పెరింజనంలో తాజా ఘటన చోటుచేసుకుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

