పాట్నా, మార్చి 5: బాయ్‌ఫ్రెండ్‌ను ఇంటికి పిలిచి ఓ మహిళ అతడి మర్మాంగాలను కోసేసింది. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని నిర్దాక్షిణ్యంగా రోడ్డుపైన పడేసింది. బీహార్‌లోని బక్సర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకున్నది. బాధితుడు అనిల్ గోండ్ పరిస్థితి విషమంగా ఉందని, స్థానిక దవాఖానలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు చెప్పారు. సదరు మహిళ ఎందుకు ఈ దాడికి తెగబడింది? అన్నది తెలియరాలేదు.
ఈ ఘటనపై బాధితుడి సోదరుడు ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ, ‘అనిల్‌ను ఇంటికి పిలిపించటంలో కుట్ర ఉంది. ముందుగా దాడిచేసి తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత తన సోదరుడితో కలిసి ఆమె అనిల్ ప్రైవేట్ భాగాలను కోసేసింది’ అని చెప్పాడు. ఉత్తరప్రదేశ్ కౌశాంబి జిల్లాలోనూ ఇలాంటిదే మరో ఘటన వెలుగుచూసింది. షరీఫ్‌పూర్ గ్రామంలో ఓ మహిళ (32).. తన పక్కింట్లో ఉండే యువకుడి(26)పై కత్తితో దాడిచేసి జననాంగాల్ని కోసేసింది. నిందితురాలిపై పోలీసులు కేసు నమోదుచేశారు.