Fake Bail | తండ్రిని కాపాడేందుకు నకిలీ బెయిల్ పత్రాలు.. రాజస్థాన్ హైకోర్టుకు అప్లోడ్ చేసి చిక్కిన టెకీ!
Fake Bail | పెరోల్‌పై జైలు నుంచి బయటకు వచ్చి షరతులను ఉల్లంఘించిన తన తండ్రిని కాపాడేందుకు కెనడాకు చెందిన ఒక ఐటీ ఇంజినీర్ నకిలీ పత్రాలతో న్యాయవ్యవస్థను మోసం చేయడానికి ప్రయత్నించిన ఘటన సంచలనం సృష్టించింది.
Fake Bail | జైపూర్: పెరోల్‌పై జైలు నుంచి బయటకు వచ్చి షరతులను ఉల్లంఘించిన తన తండ్రిని కాపాడేందుకు కెనడాకు చెందిన ఒక ఐటీ ఇంజినీర్ నకిలీ పత్రాలతో న్యాయవ్యవస్థను మోసం చేయడానికి ప్రయత్నించిన ఘటన సంచలనం సృష్టించింది. వైద్య అత్యవసర పరిస్థితి కారణంగా పెరోల్‌పై బయటకు వచ్చిన తన తండ్రి, దాన్ని ఉల్లంఘించడంతో ఆయనను కాపాడటానికి ఆ టెకీ 4,000కు పైగా పాత బెయిల్ ఉత్తర్వులను విశ్లేషించాడు.
కృత్రిమ మేధ(ఏఐ)ను ఉపయోగించి రాజస్థాన్ హైకోర్టుకు చెందిన కచ్చితమైన, చట్టపరమైన భాష, ఫార్మాటింగ్, అధికారిక ముద్రలను యథాతథంగా నకిలీలు సృష్టించాడు. ఆ తర్వాత అతను అధికారిక పోర్టల్‌ను హ్యాక్ చేసి తాను తయారుచేసిన నకిలీ 30 రోజుల బెయిల్ ఉత్తర్వులను నేరుగా ప్రభుత్వ వ్యవస్థలోకి అప్లోడ్ చేశాడు. స్థానిక సూరత్‌గఢ్ కోర్టులో ఈ నకిలీ పత్రాలను ధైర్యంగా సమర్పించే వరకు వారి సైబర్ నేరం బయటపడలేదు. అయితే రిజిస్ట్రీలో తేడాలు అనుమానాలను రేకెత్తించడంతో వారి బండారం బయటపడింది. దీంతో వారి కోసం పోలీసు గాలింపు మొదలైంది. చివరకు పంజాబ్‌లోని లూథియానాలో తండ్రీకొడుకులిద్దరూ అరెస్టు అయ్యారు.
ఫేక్ ఆర్డర్స్ నమ్మి వెబ్సైట్ల రద్దుకు డీవోటీ ఉత్తర్వులు
రెండు నకిలీ కోర్టు ఆర్డర్ల ఆధారంగా 129 బెట్టింగ్ వెబ్సైట్లను నిలిపివేస్తూ సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వమే ఆదేశాలు జారీ చేసిన విషయం దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్నది. ఒక కేంద్ర ప్రభుత్వ శాఖ ఇలా సైబర్ నేరగాళ్ల వలలో ఎలా పడింది? దీనివెనుక ఎవరి హస్తం ఉందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వ టెలికమ్యూనికేషన్స్ శాఖ (డీవోటీ) ఈ ఏడాది 129 అక్రమ బెట్టింగ్ వెబ్‌సైట్‌ను బ్లాక్ చేయాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలకు ఆధారంగా చూపిన రెండు హైకోర్టు ఉత్తర్వులు నకిలీవని తేలింది. ఈ విషయాన్ని రాయిటర్స్ తన పరిశోధన ద్వారా వెల్లడించింది. ఈ పరిశోధనలో వెలుగులోకి వచ్చిన విషయాల ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో దీనిపై పోలీస్ దర్యాప్తు ప్రారంభమైంది.
ఆన్లైన్ ఉనికికి భారీ ముప్పు
రాజస్థాన్ హైకోర్టు, యూపీ అలహాబాద్ హైకోర్టు జారీ చేసినట్టుగా పేర్కొంటూ వచ్చిన ఉత్తర్వులు భారత దేశ అధికారిక కంటెంట్ తొలగింపు వ్యవస్థ ద్వారా ఆమోదం పొంది అమలయ్యాయి. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వ్యవస్థల్లో ఒకటిగా దీనికి గుర్తింపు ఉంది. అయితే నకిలీ కోర్టు ఉత్తర్వులు ఈ పటిష్ఠమైన వ్యవస్థ నుంచి అమలులోకి వస్తున్నాయని రాయిటర్స్ కథనం ప్రకారం తెలుస్తున్నది. ఈ వ్యవస్థలో ఉన్న లోపం కారణంగా, భారతదేశంలో కార్యకలాపాలు నిర్వహించే ఏ సంస్థ అయినా ఆన్లైన్ ఉనికికి ముప్పు ఎదుర్కొనే అవకాశం ఉంది.
డాట్ జూలై 21, సెప్టెంబర్ 2న రెండు బ్లాకింగ్ ఆదేశాలను జారీ చేసింది. ఈ రెండూ దాని వెబ్సైట్లో సాధారణ అప్లోడ్లలో భాగంగా అందుబాటులో ఉన్నాయి. దీనితో పాటు డజన్ల కొద్దీ వెబ్సైట్లను తొలగించాలని ఆదేశిస్తూ కోర్టు ఉత్తర్వులుగా పేర్కొంటున్న వాటి ఈమెయిల్ కాపీలు కూడా జతచేసి ఉన్నాయి. అయితే డాట్ ఉదహరించిన ఈ కోర్టు ఉత్తర్వులు ఆ రెండు కోర్టులకు సంబంధించిన వెబ్‌సైట్‌ల్లో రాయిటర్స్‌కు లభ్యం కాలేదు.
స్పందించిన హైకోర్టు
దీనిపై రాయిటర్స్ కోరిన వివరణపై రాజస్థాన్ హైకోర్టు స్పందించింది. డాట్ ఉత్తర్వుల్లో పేర్కొన్న కోర్టు ఉత్తర్వులు నకిలీవని, ఆ ఉత్తర్వులు తమ సర్వర్‌లో లేవని పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TG Genco | ఒకప్పుడు ఓనర్.. ఇప్పుడు మీడియేటర్.. కాంగ్రెస్ పాలనలో తారుమారైన జెన్కో పరిస్థితి
Revanth Reddy | చెరువు నీళ్లకు వేలంపాట.. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో సాగునీటి అర్రాస్!
Gaddam Vamsi Krsihna | ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా అధైర్యపడొద్దు.. కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ హాట్ కామెంట్స్
Fake Bail | తండ్రిని కాపాడేందుకు నకిలీ బెయిల్ పత్రాలు.. రాజస్థాన్ హైకోర్టుకు అప్లోడ్ చేసి చిక్కిన టెకీ!
Honeytrap | నగ్న చిత్రానికో దేశ రహస్యం.. విదేశీ ఏజెంట్‌కు ఐఏఎఫ్ వింగ్ కమాండర్ ఆఫర్!
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

