కనీస మద్దతు ధరపై చట్టానికి పార్లమెంట్ సెషన్ నిర్వహించాలి
పంటలకు కనీస మద్దతు ధరపై(ఎంఎస్పీ) చట్టం తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక రోజంతా పార్లమెంట్ సమావేశం నిర్వహించాలని రైతు నేత శర్వాన్ సింగ్ పంధేర్ డిమాండ్ చేశారు.
- కేంద్రానికి రైతు సంఘాల డిమాండ్
చండీగఢ్, ఫిబ్రవరి 20: పంటలకు కనీస మద్దతు ధరపై(ఎంఎస్పీ) చట్టం తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక రోజంతా పార్లమెంట్ సమావేశం నిర్వహించాలని రైతు నేత శర్వాన్ సింగ్ పంధేర్ డిమాండ్ చేశారు. ఎంఎస్పీకి చట్టబద్ధత, రైతు రుణాల మాఫీతో సహా ఇతర అన్ని డిమాండ్లను నెరవేర్చాలన్నారు. రైతులతో కేంద్ర సంస్థల ఒప్పందం మేరకు ఐదేండ్ల పాటు పప్పు ధాన్యాలు, మక్కజొన్న, పత్తి పంటలను ఎంఎస్పీకి కొనుగోలు చేస్తామని నాలుగో దఫా చర్చల సందర్భంగా కేంద్రం చేసిన ప్రతిపాదనను రైతు సంఘాలు సోమవారం తిరస్కరించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో రైతు నేత శర్వాన్ సింగ్ పంజాబ్-హర్యానా సరిహద్దు శంభు వద్ద మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఎంఎస్పీపై చట్టం చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇందు కోసం ఒక రోజంతా పార్లమెంట్ సెషన్ నిర్వహించాలని, దీన్ని ఏ ప్రతిపక్షం వ్యతిరేకించదని అన్నారు. రైతులు చేస్తున్న ఏ డిమాండ్‌ను కేంద్రం అంగీకరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుత ఆందోళనలు చేపట్టేందుకు ఢిల్లీ వైపుగా వెళ్లనీయండి అని మరో రైతు నేత అశోక్ బులరా డిమాండ్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

