న్యూఢిల్లీ, జూలై 28: ఆగస్టు నెలలో ఆకాశంలో అద్భుతం జరగనున్నది. ఒకే నెలలో రెండు సూపర్మూన్లకు ఆగస్టు వేదిక కానున్నది. ఆగస్టు 1న మొదటి సూపర్మూన్ దర్శనమివ్వనుండగా, అదే నెల 30న మరోసారి సూపర్మూన్ (బ్లూ మూన్) కనువిందు చేయనున్నది.
ఆగస్టు 1న మధ్నాహ్నం 1.33 గంటలకు చంద్రుడు భూమికి అతి దగ్గరగా రావడంతో మరింత పెద్దగా, ప్రకాశవంతంగా కనిపించనున్నాడు. సాధారణంగా ఏడాదికి మూడు లేదా నాలుగు సూపర్మూన్లు దర్శనమిస్తాయి. ఈ ఏడాది జూలై 3న మొదటిది కనిపించగా, సెప్టెంబర్ 29న నాలుగో సూపర్మూన్ కనువిందు చేయనున్నది.