ఢిల్లీ : న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వస్తు న్న విమానంలో తోటి ప్రయాణికుడిపై ఓ వ్యక్తి మూత్రవిసర్జన చేశాడు. జాన్ ఎఫ్ కెన్నడీ విమానాశ్రయం నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి ఓ విమానం బయలుదేరింది. మద్యం సేవించిన ఓ ప్రయాణికుడు తోటి ప్రయాణికుడితో వాదనకు దిగి దురుసుగా ప్రవర్తిస్తూ మూత్రవిసర్జన చేశాడు. దీంతో ఢిల్లీలో విమానం దిగగానే నిందితుడిని పోలీసులకు అప్పగించారు.