కొచ్చి: కేరళలోని కొచ్చి నగరంలో దారుణం జరిగింది. కాలూర్ ప్రాంతంలోని ఆజాద్ రోడ్డులో జనం రద్దీ మధ్యనే ఓ వ్యక్తి ఒక మహిళపై వేట కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో మహిళకు గాయాలయ్యాయి. నిందితుడు ఒక మహిళపై వేటువేస్తుండగా మరో మహిళ చేయి అడ్డుపెట్టడంతో ఆమె చేయి తెగింది.
ఇవాళ ఉదయం 11 గంటల సమయంలో ఆజాద్ రోడ్డులో ఇద్దరు మహిళలు, ఒక యువకుడికి మధ్య గొడవ జరిగింది. మాటామాటా పెరగడంతో సహనం కోల్పోయిన యువకుడు తన దగ్గరున్న వేట కత్తితో ఒక మహిళ తలపై దాడి చేయబోయాడు. అది గమనించిన మరో మరో మహిళ తన చేతిని అడ్డుపెట్టడంతో ఆమె చేయి తెగింది.
అనంతరం నిందితుడు తన చేతిలోని కత్తిని, తన బైకును అక్కడే వదిలేసి పరారయ్యాడు. ఈ ఘటనలో గాయపడిన మహిళను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. బాధిరాళ్ల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.